లీక్ అయిన బజాజ్ ఆర్‌ఇ ఎలక్ట్రిక్ రిక్షా స్పెసిఫికేషన్స్!

ఇండియాలో బాగా ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఒకటి. బజాజ్ ఇదివరకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ రిక్షాను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. బజాజ్ ప్రవేశపెట్టనున్న ఈ ఎలక్ట్రిక్ రిక్షా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

లీక్ అయిన బజాజ్ ఆర్‌ఇ ఎలక్ట్రిక్ రిక్షా స్పెసిఫికేషన్స్!

ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం బైకులకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పుడు త్రి వీలర్లు కూడా ఎలెక్రిక్ వాహనాలుగా మారనున్నాయి. ఇప్పుడు బజాజ్ నుంచి అదే విధమైన త్రి వీలర్ మార్కెట్లోకి రానుంది.

లీక్ అయిన బజాజ్ ఆర్‌ఇ ఎలక్ట్రిక్ రిక్షా స్పెసిఫికేషన్స్!

బజాజ్ నుంచివచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్. ఇప్పుడు బజాజ్ ఆటో తన మొదటి ఎలక్ట్రిక్ రిక్షాను కూడా విడుదల చేయనుంది. రాబోయే త్రీ-వీలర్‌ను ‘బజాజ్ ఆర్‌ఇ ఇవి' అని పిలుస్తారు.

బజాజ్ ఆర్‌ఇ ఇవి యొక్క కొలతలను గమనించినట్లైయితే దాని పొడవు 2,714 మిమీ, వెడల్పు 1,350 మిమీ మరియు ఎత్తు 1,772 మిమీ. ఇది 2010 మిమీ వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది. దీని బరువు 732 కిలోలు ఉంటుంది.

లీక్ అయిన బజాజ్ ఆర్‌ఇ ఎలక్ట్రిక్ రిక్షా స్పెసిఫికేషన్స్!

ఇందులో 1 + 3 సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. ఇది డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది. ఈ రిక్షాకు 4.3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు శక్తినిస్తుంది. బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 42 కి.మీ ఉంటుంది.

బజాజ్ ఎలక్ట్రిక్ రిక్షా ప్రొడక్షన్ వెర్షన్ యొక్క బ్యాటరీ ఫీచర్స్ ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కానీ ఇందులో ప్రోటోటైప్‌లో 48-వోల్ట్ మార్పిడి చేయగల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఇవి దాదాపుగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. బజాజ్ ఆర్‌ఇ యొక్క స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వేరియంట్ ప్రత్యేకమైన డిజైన్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

లీక్ అయిన బజాజ్ ఆర్‌ఇ ఎలక్ట్రిక్ రిక్షా స్పెసిఫికేషన్స్!

బజాజ్ ఎలక్ట్రిక్ రిక్షా మార్కెట్లో మహీంద్రా ట్రెతో పోటీ పడనుంది. ఇది నాలుగు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 1,65,552 నుండి రూ. 2,69,383 మధ్య ఉండవచ్చు.

దీనిని ప్రారంభించినప్పుడు దాదాపుగా 2,50,000 రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 1 + 4 సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ రిక్షా త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. మొట్ట మొదటి ఎలక్ట్రిక్ రిక్షాని తయారు చేసిన ఘనత బజాజ్ కి దక్కుతుంది.

Most Read Articles

English summary
Exclusive: Bajaj RE EV electric rickshaw specs leaked, to be launched soon. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X