సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ అందిస్తున్న "ఫ్లయింగ్ స్పర్" లగ్జరీ కార్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 40,000 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు బెంట్లీ పేర్కొంది. ఈ లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ యొక్క 40,000వ మోడల్‌ను యూకేలోని క్రీవ్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో దీనిని తయారు చేశారు.

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

ఒరిజినల్‌గా కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ అని పిలువబడే ఈ కారును కాంటినెంటల్ జిటి నుండి వేరు చేయడం కోసం ఫ్లయింగ్ స్పర్‌గా మార్చారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన లగ్జరీ స్పోర్ట్ సెడాన్.

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్‌లో ఇప్పటి వరకూ మూడు తరాలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నది మూడవ తరం మోడల్. తరతరాలుగా ఈ మోడల్ పనితీరు మరియు లగ్జరీ రెండింటిలోనూ మెరుగుపరుస్తూ వచ్చారు. తయారు చేయబడిన 40,000 కార్లలో ప్రతి ఒక్క కారుపై సిబ్బంది సుమారు 100 గంటలకు పైగా అంకిత భావంతో పనిచేశారు. ఈ ప్లాంట్‌లో 250 మంది బృందం ప్రతి ఫ్లయింగ్ స్పర్‌ను చేతుల్తో అసెంబుల్ చేస్తారు.

MOST READ:పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన కవాసకి నింజా బైక్ రేసర్లు.. చివరికి ఏమైందంటే ?

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

అసెంబుల్ అయిన తర్వాత, కారు వివరాలను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి వందలాది నాణ్యతా తనిఖీలకు గురిచేస్తారు. బెంట్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 68 వేర్వేరు దేశాల్లో ఈ కారును దాని యజమానికి ప్రత్యేకంగా రవాణా చేస్తారు. బెంట్లీ గడచిన 15 ఏళ్లుగా ఫ్లయింగ్ స్పర్ కారును తయారు చేస్తోంది.

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

చైనా, అమెరికా ప్రాంతాల్లో సుమారు 50 శాతం వినియోగదారులకు ఈ కారును అమ్మినట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా బెంట్లీ బ్రాండ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్నాయి. ఫ్లయింగ్ స్పర్ మొత్తం అమ్మకాల్సో యూకే కేవలం 10 శాతం అమ్మకాలను మాత్రమే నమోదు చేస్తోంది.

MOST READ:దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ : ధర & ఇతర వివరాలు

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

మిగిలిన 40 శాతం కార్లను యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆసియా పసిఫిక్ దేశాల్లోని కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ యొక్క విశిష్ట చరిత్ర 1952 నాటిది. 13 సంవత్సరాల తరువాత 1952 మరియు 1965 మధ్య కాలంలో తయారు చేసిన అనేక ఉత్పత్తులో ఫ్లయింగ్ స్పర్ పేరు సంస్థ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఓ భాగంగా ఉండేది కాదు.

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ పేరును తొలిసారిగా 2005లో ఉపయోగించారు. ఇందులో మొదటి మోడల్ కాంటినెంటల్ జిటి కూపే యొక్క 4-డోర్ వెర్షన్. అప్పట్లో ఈ మోడల్ డబ్ల్యూ12 ఇంజన్ మరియు ఆల్-వీల్ డ్రైవ్‌తో లభించేది మరియు ఇది గరిష్టంగా గంటకు 312 కి.మీ వేగంతో పరుగులు తీసేది.

MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

కాగా, 2013లో బెంట్లీ రెండవ తరం ఫ్లయింగ్ స్పర్‌ను ప్రత్యేకమైన మోడల్ లైన్‌గా ప్రారంభించింది. కాంటినెంటల్ మోనికర్‌ను రెండవ తరం మోడల్ నుండి తొలగించబడింది. సెకండ్-జెన్ మోడల్‌లో 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇందులో ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టారు.

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మూడవ తరం బెంట్లీ ఫ్లయింగ్ స్పర్‌ను గత ఏడాది ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో తేలికపాటి-హైబ్రిడ్ ఇంజన్‌తో సహా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేశారు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ మరియు స్టీరింగ్‌ను కలిగి ఉన్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్.

MOST READ:ఒకే ఇంట్లో మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఎదో తెలుసా ?

సరికొత్త మైలురాయిని చేరుకున్న బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - వివరాలు

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రొడక్షన్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ఫోర్-డోర్ వెర్షన్ సెడాన్, ఇది లగ్జరీ, కంఫర్ట్‌తో పాటుగా గరిష్టమైన పనితీరును కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రారంభ ధర రూ.4.06 కోట్లు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

Most Read Articles

English summary
The Bentley Flying Spur has completed over 40,000 units in production for the luxury automaker. The new milestone mark was announced recently as the 40,000th example of the luxury sports sedan rolled out from the production line at the company manufacturing facility in Crewe, the UK. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X