క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ అందిస్తున్న "ఫ్లయింగ్ స్పర్" మోడల్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని, ఈ నేపథ్యంతో 'రీన్డీర్ ఎయిట్' పేరుతో బెంట్లీ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది.

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

కొత్త బెంట్లీ రీన్డీర్ ఎయిట్ మోడల్‌ను బ్రాండ్ యొక్క ఫ్లయింగ్ స్పర్ వి8 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఈ లగ్జరీ కారు బెస్పోక్ ఎలిమెంట్స్‌తో పాటుగా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో క్రిస్మస్ థీమ్‌ను హైలైట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు.

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

బెంట్లీ రీన్డీర్ ఎయిట్ కారును ‘క్రికెట్ బాబుల్' అని పిలువబడే బెస్పోక్ క్రికెట్ బాల్ కలర్ పెయింట్ స్కీమ్‌తో డిజైన్ చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ బోనెట్‌పై ముందు భాగంలో బెంట్లీ యొక్క 'ఫ్లయింగ్ బి' మస్కట్ స్థానంలో త్రీ డైమన్షియల్ రీన్డీర్ ఉంటుంది. ఈ కారు సైడ్స్‌లో ‘వి 8' బ్యాడ్జ్ స్థానంలో ‘రీన్డీర్ ఎయిట్' బ్యాడ్జ్‌లు ఉంటాయి.

MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

ఈ స్పెషల్ ఎడిషన్ క్రిస్మస్ థీమ్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్ మోడల్‌లో కారు చుట్టూ గోల్డ్ కలర్ యాక్సెంట్స్, గోల్డ్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. సైడ్స్‌లో వింటర్ మరియు స్నో సీజన్‌ను తలపించేలా డైమండ్ ప్యాటర్న్ గ్రాఫిక్స్ కూడా కనిపిస్తుంది. ఈ కారులో ఆల్-సీజన్ 22 ఇంచ్ టైర్లను ఉపయోగించారు.

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కూడా క్రిస్మస్ థీమ్ కనిపిస్తుంది. ఇంటీరియర్స్‌లో కూడా అదే క్రికెట్ బాబుల్ కలర్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. దీనిపై కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటంటే, ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్ (శాంతా క్లాజ్) పేరును డ్రైవర్ సీటుపై ఎంబ్రాయిడరీ చేసి ఇస్తారు.

MOST READ:మైండ్‌తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

బెంట్లీ రీన్డీర్ ఎయిట్ కారులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ జిపిఎస్ నావిగేషన్‌తో పాటుగా పలు ఇతర లగ్జరీ ఫీచర్లు కూడా లభిస్తాయి. ముందు సీట్లలో ప్యాసింజర్ సీటు వైపు ఉన్న బ్లాక్ వెనిర్ బెస్పోక్ గ్రాఫిక్స్‌తో వస్తుంది, ఇది ఉత్తర ధ్రువంలో రాత్రి దృశ్యాన్ని వర్ణిస్తున్నట్లు అనిపిస్తుంది.

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

ఈ శాంటా క్లాజ్ కారులో శక్తివంతమైన 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 549 బిహెచ్‌పి పవర్‌ను మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 318 కిలోమీటర్లుగా ఉంటుంది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ లగ్జరీ కారు విషయానికి వస్తే, ఈ మోడల్ ఇటీవలే ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫ్లయింగ్ స్పర్ కారుని మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 40,000 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు బెంట్లీ పేర్కొంది. ఈ లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ యొక్క 40,000వ మోడల్‌ను యూకేలోని క్రీవ్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో దీనిని తయారు చేశారు.

క్రిస్మస్ థీమ్‌తో తయారు చేసిన 'బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ రీన్డీర్ ఎయిట్' ఎడిషన్

ఒరిజినల్‌గా కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ అని పిలువబడే ఈ కారును కాంటినెంటల్ జిటి నుండి వేరు చేయడం కోసం ఫ్లయింగ్ స్పర్‌గా మార్చారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన లగ్జరీ స్పోర్ట్ సెడాన్. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

Most Read Articles

English summary
Bentley's Christmas Themed Flying Spur ‘Reindeer Eight’ Unveiled, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X