తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

చాలా మంది తమ తల్లి దండ్రులపైన ప్రేమతో కొన్ని విలువైన వస్తువులను వాహనాలను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్ కూడా తన తల్లికి ఒక విలాసవంతమైన కారు ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఇప్పుడు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన పుట్టిన రోజున తన తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

ప్యార్ కా పంచనామా మరియు దాని సీక్వెల్ చిత్రంలో మోనోలాగ్‌కు ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన పుట్టినరోజున తన తల్లి మాలా తివారీకి మినీ కూపర్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

డ్రైవ్ చేయడానికి చాలా సరదాగా ఉండే చిన్న స్పోర్ట్స్ కార్ ఎస్ వేరియంట్. ఇది 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 192 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 280 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని కేవలం 1,250 ఆర్‌పిఎమ్ నుండి విడుదల చేస్తుంది. దీని ధర రూ. 49.5 లక్షలు(ఆన్-రోడ్ ముంబై). మినీ కూపర్ ఎస్ భారతదేశంలో అమ్ముడైన 2 డోర్ కన్వర్టిబుల్స్.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

మినీ కూపర్ 3-డోర్ల కన్వర్టిబుల్ రూపంలో అందించే ప్రతి ఇతర కారు చాలా ఎక్కువ ధరతో ఉంటుంది. పనితీరు పరంగా మినీ కూపర్ ఎస్ కేవలం 7 సెకన్లలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే దీని యొక్క టాప్ స్పీడ్ 225 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్‌లో నలుగురికి సీటింగ్ లభిస్తుంది కాని రెండవ వరుస సీట్లు పిల్లలకు మాత్రమే సరిపోయేవిధంగా ఉంటాయి. కారు యొక్క రెండు డోర్ లేఅవుట్ అంటే రెండవ వరుస సీట్లలోకి రావడం చాలా గజిబిజిగా ఉంటుంది. అంటే కారు రెండు సీటర్లు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ రెండవ వరుస సీట్లు అత్యవసర పరిస్థితులకు బాగా సరిపోతాయి.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారులో భద్రతా విషయాలను గమనించినట్లైయితే ఇందులో రెండు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఒకటి డ్రైవర్ కోసం, రెండవది కో-ప్యాసింజర్ కోసం ఉపయోగపడతాయి. ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ముందు మరియు వెనుక భాగంలో పార్కింగ్ సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆఫర్‌లో ఉన్న ఇతర ముఖ్య భద్రతా లక్షణాలు.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో పాటు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, రేక్ అండ్ రీచ్ కోసం సర్దుబాటు చేసే స్టీరింగ్ మొదలైనవి ఉంటాయి.

తల్లికి మినీ కూపర్ కన్వర్టిబుల్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటుడు!

కూపర్ ఎస్ కన్వర్టిబుల్‌తో పాటు, మినీ హార్డ్-టాప్ కూపర్, కంట్రీమాన్ మరియు క్లబ్‌మన్ వేరియంట్ల వంటి ఇతర కార్ల సమూహాలను కూడా విక్రయిస్తుంది. ఈ వేరియంట్లలో కొన్ని డీజిల్ ఇంజిన్‌ను కూడా పొందుతాయి.

Most Read Articles

English summary
Bollywood actor Kartik Aryan gifts mum a Mini Cooper Convertible on her birthday. Read in Telugu.
Story first published: Saturday, January 18, 2020, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X