భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ సంస్థ తన బ్రాండ్ అయిన 2 సిరీస్ గ్రాన్ కూపేని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త 2 సిరీస్ గ్రాన్ కూపే భారతదేశంలో ఈ బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్. ఈ కొత్త బిఎండబ్ల్యు 2 గ్రాన్ కూపే గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

త్వరలో ప్రారంభించబోయే 2 సిరీస్ గ్రాన్ కూపే ఈ ఏడాది చివర్లో ఎంపిక చేసిన డీలర్లలో లభిస్తుంది. ఇండియా ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ ఎంట్రీ లెవల్ 2 సిరీస్ గ్రాన్ కూపే ధర రూ. 33 లక్షలు. బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపేను గత ఏడాది నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఈ ఎంట్రీ లెవల్ బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కారు సంస్థ యొక్క మాడ్యులర్ ఎఫ్ఎఆర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడింది.

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

ఎఫ్ఎఆర్ ప్లాట్‌ఫాం బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన మినీ బ్రాండ్ నుండి తీసుకోబడింది. ఈ ప్లాట్‌ఫాం విస్తృత క్యాబిన్‌ను అందిస్తుందని మరియు ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. బిఎమ్‌డబ్ల్యూ అన్ని మోడళ్లలో వెనుక-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ను అందించనుంది.

MOST READ:కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే యొక్క కొలతలను గమనించినట్లయితే 4,526 మి.మీ పొడవు, 1,800 మి.మీ వెడల్పు మరియు 1,420 మి.మీ ఎత్తు కలిగి ఉండటమే కాకుండా, ఈ లగ్జరీ కారులో 2,670 మి.మీ వీల్‌బేస్ ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే దాని ప్రత్యర్థి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ కంటే 59 మి.మీ పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది.

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే 8 సిరీస్ గ్రాన్ కూపే నుండి ప్రేరణ పొందింది. ఈ సెడాన్ ముందు భాగంలో ఐ-ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్‌ఎల్ సిస్టమ్‌తో పెద్ద గ్రిల్ ఇవ్వబడుతుంది. వీటితో పాటు పెద్ద చక్రాలు, లాంగ్‌బోర్డ్ మరియు వాలుగా ఉన్న పైకప్పు ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

MOST READ:బిఎస్ 6 వెర్షన్ లో విడుదల కానున్న బజాజ్ డిస్కవరీ మరియు వి మోడల్స్

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే లోపలి భాగంలో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు పెద్ద డిస్ప్లేలను కలిగి ఉంటుంది. ఈ కారులో సరికొత్త ఐడ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎయిర్-కాన్ వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపేకి రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. వీటిలో 220 ఐ '2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 192 బిహెచ్‌పిని ఉత్పత్తి చేయగా, 220 డి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 190 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

భారత్‌లో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే

కొత్త లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఈ బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే భారతదేశంలో ప్రారంభించిన తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏది ఏమైనా త్వరలో బీఎండబ్ల్యూ నుంచి కొత్త సెడాన్ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది.

Most Read Articles

English summary
BMW 2 Series Gran Coupe India Launch This Year. Read in Telugu.
Story first published: Thursday, May 7, 2020, 14:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X