Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి షాడో ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న '3 సిరీస్ గ్రాన్ టురిస్మో' మోడల్‌లో ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో 'షాడో ఎడిషన్' పేరిట మార్కెట్లో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.42.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో షాడో ఎడిషన్ ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 3 సిరీస్‌లోని '330ఐ ఎమ్ స్పోర్ట్' వేరియంట్ ఆధారంగా రూపొందించబడినది. ఇది ఆల్పైన్ వైట్, మెల్బోర్న్ రెడ్ మెటాలిక్, బ్లాక్ సఫైర్ మెటాలిక్ మరియు ఎస్టోరిల్ బ్లూ మెటాలిక్ అనే నాలుగు విభిన్న రంగులలో లభ్యం కానుంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి ‘షాడో ఎడిషన్'లో లిమిటెడ్ ఎడిషన్ థీమ్‌కు తగినట్లుగా కొన్ని డిజైన్ మార్పులు ఉన్నాయి. ఇందులోని డిజైన్ ఎలిమెంట్స్ బ్లాక్ హై-గ్లోసీ ఫినిష్‌లో ఉంటాయి. తొమ్మిది స్లాట్‌లతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ-గ్రిల్, స్మోక్డ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జెట్ బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. ఎగ్జాస్ట్ టెయిల్ పైప్‌లను కూడా బ్లాక్ క్రోమ్ ఫినిష్‌లో డిజైన్ చేశారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ ; కార్ ఓనర్ టీ అమ్ముకునేలాగా చేసింది, ఎలాగో చూడండి

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి షాడో ఎడిషన్ క్యాబిన్ కూడా స్పెషల్ ఎడిషన్‌కు తగినట్లుగానే స్పెషల్‌గా ట్రీట్ చేశారు. ఎమ్ లోగో, ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్, యాంబియంట్ లైటింగ్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, అన్ని కంట్రోల్స్‌ను సులువుగా యాక్సెస్ చేయగల డ్రైవర్-ఆధారిత కాక్‌పిట్, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3డి మ్యాప్స్, బిఎమ్‌డబ్ల్యూ యాప్స్ వంటి స్పెషల్ ఫీచర్లు దీని సొంతం.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 330ఐ ఎమ్ స్పోర్ట్ షాడో ఎడిషన్‌లో స్టాండర్డ్ జిటి వేరియంట్‌లో ఉన్న పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇందులోని 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 248 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 6 సెకన్లలోనే గంటకు 0 - 100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు.
MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో షాడో ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, "బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో ఈ విభాగంలో ఒక ప్రత్యేకమైన వాహనం. ఇది విశిష్టమైన ఫీచర్లతో విలాసవంతమైన క్యాబిన్ అనుభూతిని మరియు శక్తివంతమైన ఇంజన్‌తో స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని మిళతం చేస్తుంద"ని అన్నారు.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి షాడో ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటి షాడో ఎడిషన్ బ్రాండ్ యొక్క గ్రాన్ టురిస్మో లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంటుంది. ఈ లైనప్‌లో 6 సిరీస్ జిటి కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త 3 సిరీస్ జిటి షాడో ఎడిషన్ దాని విశిష్టమైన ఫీచర్లు, స్టయిలింగ్‌తో ఖచ్చితంగా ఇది కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటుదనేది మా అభిప్రాయం.
MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి