Just In
Don't Miss
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో తమ 320డి స్పోర్ట్ వేరియంట్‌ను తిరిగి విడుదల చేసింది. ఈ ఏడాది మార్చ్ నెలలో బిఎమ్‌డబ్ల్యూ తమ పెట్రోల్ వెర్షన్ 3 సిరీస్ కారు 330ఐ స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసినప్పుడు, ఇందులో 320డి స్పోర్ట్ మోడల్‌ను కంపెనీ నిలిపివేసింది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి స్పోర్ట్ వేరియంట్, ఈ బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న 3-సిరీస్ ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ లగ్జరీ కారులో ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి ఫాగ్ లైట్స్, పానోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి కారులోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, పది-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మరియు అనలాగ్ స్టైల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో చాలా మంది తయారీదారులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ మరియు పార్కింగ్ అసిస్టెంట్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను బిఎమ్‌డబ్ల్యూ 320డి కోల్పోతుంది.
MOST READ:భారత రాష్ట్రపతి ఉపయోగించే కార్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి కారు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి - ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, మెడెటేరియన్ బ్లూ. ఇది రెండు వేరియంట్లలో (స్పోర్ట్ మరియు లగ్జరీ లైన్) లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.42.10 లక్షలు మరియు రూ.47.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.
MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

బిఎమ్‌డబ్ల్యూ సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ అధునాతమ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం కానుంది. డార్క్ షాడో ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఈ సిరీస్‌లోని అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన అంశం దీని పెయింట్ స్కీమ్. ఫ్రోజెన్ ఆర్కిటిక్ గ్రే మెటాలిక్ పెయింట్‌తో ఈ కారును మొత్తాన్ని పెయింట్ చేశారు. బ్రాండ్ యొక్క హై లెవల్ పర్సనలైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగమైన బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ ఈ పెయింట్‌ను తయారు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇదివరకెన్నడూ లేనట్లుగా, ఏ ఎస్యూవీల్లోనైనా కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను అందించడం ఇదే మొదటిసారి.
MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆరు-సీట్లు లేదా ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. లోపలి భాగంలో, ట్రిమ్స్‌పై ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీ డీటేలింగ్క్ కనిపిస్తాయి. ఇందులో ఎమ్ స్పెక్ లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయెల్-టోన్ మెరినో ఫుల్ లెథర్ అప్‌హోలెస్ట్రీ నైట్ బ్లూ మరియు బ్లాక్ కలర్ స్టిచింగ్, నైట్ బ్లూలో అల్కాంటారా ఫనిషింగ్తై రూఫ్ లైనర్ వంటి మార్పులు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
బిఎమ్‌డబ్ల్యూ 320డి దేశంలో అత్యధికంగా అమ్ముడైన బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఒకటి. కొత్త డీజిల్ నిబంధనల కారణంగా బిఎమ్‌డబ్ల్యూ తొలుత ఈ కారును నిలిపివేయాలని భావించినప్పటికీ, భారతదేశంలో డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను రీలాంచ్ చేసింది. అయితే, ఈ సెగ్మెంట్లో ఇంత ధర చెల్లించి కూడా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందటం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.