భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో తమ 320డి స్పోర్ట్ వేరియంట్‌ను తిరిగి విడుదల చేసింది. ఈ ఏడాది మార్చ్ నెలలో బిఎమ్‌డబ్ల్యూ తమ పెట్రోల్ వెర్షన్ 3 సిరీస్ కారు 330ఐ స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసినప్పుడు, ఇందులో 320డి స్పోర్ట్ మోడల్‌ను కంపెనీ నిలిపివేసింది.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 320డి స్పోర్ట్ వేరియంట్, ఈ బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న 3-సిరీస్ ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ లగ్జరీ కారులో ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, ఎల్‌ఈడి ఫాగ్ లైట్స్, పానోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 320డి కారులోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, పది-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మరియు అనలాగ్ స్టైల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో చాలా మంది తయారీదారులు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్ మరియు పార్కింగ్ అసిస్టెంట్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను బిఎమ్‌డబ్ల్యూ 320డి కోల్పోతుంది.

MOST READ:భారత రాష్ట్రపతి ఉపయోగించే కార్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 320డి కారు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి - ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, మెడెటేరియన్ బ్లూ. ఇది రెండు వేరియంట్లలో (స్పోర్ట్ మరియు లగ్జరీ లైన్) లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.42.10 లక్షలు మరియు రూ.47.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ అధునాతమ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం కానుంది. డార్క్ షాడో ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఈ సిరీస్‌లోని అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన అంశం దీని పెయింట్ స్కీమ్. ఫ్రోజెన్ ఆర్కిటిక్ గ్రే మెటాలిక్ పెయింట్‌తో ఈ కారును మొత్తాన్ని పెయింట్ చేశారు. బ్రాండ్ యొక్క హై లెవల్ పర్సనలైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగమైన బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ ఈ పెయింట్‌ను తయారు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇదివరకెన్నడూ లేనట్లుగా, ఏ ఎస్‌యూవీల్లోనైనా కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను అందించడం ఇదే మొదటిసారి.

MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆరు-సీట్లు లేదా ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. లోపలి భాగంలో, ట్రిమ్స్‌పై ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీ డీటేలింగ్క్ కనిపిస్తాయి. ఇందులో ఎమ్ స్పెక్ లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయెల్-టోన్ మెరినో ఫుల్ లెథర్ అప్‌హోలెస్ట్రీ నైట్ బ్లూ మరియు బ్లాక్‌ కలర్ స్టిచింగ్, నైట్ బ్లూలో అల్కాంటారా ఫనిషింగ్‌తై రూఫ్ లైనర్ వంటి మార్పులు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎమ్‌డబ్ల్యూ 320డి దేశంలో అత్యధికంగా అమ్ముడైన బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఒకటి. కొత్త డీజిల్ నిబంధనల కారణంగా బిఎమ్‌డబ్ల్యూ తొలుత ఈ కారును నిలిపివేయాలని భావించినప్పటికీ, భారతదేశంలో డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను రీలాంచ్ చేసింది. అయితే, ఈ సెగ్మెంట్లో ఇంత ధర చెల్లించి కూడా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందటం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.

MOST READ:ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

Most Read Articles

English summary
German auto manufacturer BMW has rather quietly re-launched its 320d Sport variant in India. The brand had discontinued the 320d Sport model during March this year when it launched the 330i Sport variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X