రూ. 55.40 లక్షలకే బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ కార్

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 530 ఐ స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ ధర రూ. 55.40 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) తో అందిస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో 5- సిరీస్‌లలో బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ అత్యంత సరసమైనది. దీనిని డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ వేరియంట్ కొంత పునర్నిర్మించిన ఫ్రంట్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. అప్డేట్ చేయబడిన బంపర్, కొత్తగా రూపొందించబడిన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బయటి వైపు బ్లాక్ ట్రిమ్స్ మరియు క్రోమ్ టిప్డ్ ఎగ్జాస్ట్ పైప్స్ వంటివి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ కార్

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ లో మొబైల్ కనెక్టివిటీ, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలత గల పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఆంబియంట్ లైటింగ్, డ్యూయల్-టోన్ కాన్బెర్రా, బ్లాక్ స్కీమ్‌తో ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ మరియు 12-స్పీకర్ సిస్టమ్‌ ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ వేరియంట్ ఇప్పుడు బిఎస్ 6-కంప్లైంట్ 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 250 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. లాంచ్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్స్ రియర్-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ కారులో అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్, రన్-ఫ్లాట్ టైర్లు మరియు డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ ఉంటాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. లగ్జరీ సెడాన్ కోసం బుకింగ్స్ ఇప్పుడు తెరిచి ఉన్నాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఇప్పుడు నాలుగు పెయింట్ పథకాలతో లభిస్తుంది. అవి మినరల్ వైట్, బ్లాక్ సాప్ఫైర్, మెడిటరేనియన్ బ్లూ మరియు బ్లూస్టోన్ మెటాలిక్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ ఇప్పుడు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన 5 సిరీస్ సెడాన్. కొత్త బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో ఆడి ఎ 6 సెడాన్, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2020 BMW 530i Sport Launched In India: Prices Start At Rs 55.40 Lakh. Read in Telugu.
Story first published: Friday, February 14, 2020, 16:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X