Just In
- 58 min ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 1 hr ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- News
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి విడుదల: ధర, ఫీచర్లు మరియు వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్స్7 ఎస్‌యూవీలో ఓ సరికొత్త టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్‌ను కంపెనీ సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. పెర్ఫార్మెన్స్ ప్యాకేజ్‌తో డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి వేరియంట్‌ను రూ.1.63 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో మార్కెట్లో ప్రవేశపెట్టింది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి పాపులర్ అయిన ఎమ్ పెర్ఫార్మెన్స్ ప్యాకేజ్ (M Package)ను జోడించి ఈ కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి కారుని మరింత స్పోర్టీగా డిజైన్ చేశారు. ఈ స్టయిలింగ్ ప్యాకేజ్‌లో భాగంగా, మరింత రగ్గడ్ లుక్‌తో కూడిన ఫ్రంట్ బంపర్, ఇంజన్ కూలింగ్ కోసం బంపర్‌పై పెద్ద ఎయిర్ ఇన్టేక్స్, కొత్త మెష్, కుడి మరియు ఎడమ వైపుల 'M' పెర్ఫార్మెన్స్ బ్యాడ్జ్, రీపొజిషన్ చేసిన ఫాగ్‌ల్యాంప్స్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

అంతేకాకుండా.. సెరియం గ్రే ఫినిష్‌తో కూడిన ఓవిఆర్ఎమ్ (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్) మరియు వాటిపై మోడల్ బ్యాడ్జెస్ (ఎక్స్7 , ఎమ్50డి), కొత్త స్పోర్టీ ఎగ్జాస్ట్, 21 ఇంచ్ ఎమ్ స్టైల్ లైట్ అల్లాయ్ వీల్స్ (22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ని ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు). ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి ఇంటీరియర్లలో కూడా పెర్ఫార్మెన్స్ డీటేల్స్ కనిపిస్తాయి.
MOST READ: కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

ఓవరాల్ క్యాబిన్ ఇంటీరియర్ లుక్ రెగ్యులర్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆల్కాంటారా హెడ్‌లైనర్, వెర్నెస్కా లెథర్ అప్‌హోలెస్ట్రీ, ఎమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆరు లేదా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్, ఆటోమేటిక్ డ్రైవింగ్ లైట్స్, అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ పవర్ టెయిల్‌గేట్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి సొంతం.

ఇందులో పెద్ద 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది బ్రాండ్‌కి చెందిన స్వంత సాఫ్ట్వేర్ కనెక్టివిటీతో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇది ఎమ్-స్పెసిఫిక్ డిస్ప్లే ఫీచర్లయిన స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ ఆప్షన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. వాయిస్, టచ్ మరియు హ్యాండ్వ్రైటింగ్ రికగ్నిషన్ ఫీచర్లను కలిగిన బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. ఇంకా అందులో పాపులర్ హార్మన్ కార్డన్ బ్రాండ్ ఆడియో సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు.
MOST READ: మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలో అన్ని వైపుల నుంచి రక్షణ ఇచ్చేలా తొమ్మిది ఎయిర్ బ్యాగ్‌లు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే డైనమిక్ బ్రేక్ కంట్రోల్, డ్రిఫ్టింగ్ చేస్తునప్పుడు లేదా రోడ్డు మూలల్లో కారు స్కిడ్ అయినప్పుడు ఉపయోగపడే కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, రోడ్డుపై మరింత స్థిరత్వాన్ని ఇచ్చే స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్, ఎగుడు దిగుడు రోడ్లపై ఉపయోగపడే హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమ్ స్పోర్ట్ బ్రేక్స్, బ్లూ కలర్లో పెయింట్ చేసిన బ్రేక్ కాలిపర్స్ వంటి ఫీచర్లున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి ఎస్‌యూవీలో పవర్ఫుల్ 3.0 లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 395 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ 'xDrive'(ఆల్-వీల్ డ్రైవ్) టెక్నాలజీ ద్వారా ఈ ఇంజన్ శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.
MOST READ: కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్

ఇక వేరే వార్తల్లోకి వెళితే.. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నిన్న (జూన్ 11, 2020) దేశీయ విపణిలోకి తమ సరికొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ )ఎక్స్6 (BMW X6) ఎస్‌యూవీని విడుదల చేసింది. ఎస్‌యూవీలోని కంఫర్ట్, కూప్‌లోని స్టయిల్‌ను కలగలిపి డిజైన్ చేసిన కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ప్రారంభ ధర రూ.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ ఎస్యూవీ-కూప్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లలో విక్రయించనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
పెర్ఫార్మెన్స్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎమ్50డి ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, ఆడి క్యూ8 ఎస్యూవీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎక్స్7 కారులో కంపెనీ మొట్టమొదటి సారిగా 7-సీటర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బిఎమ్‌డబ్ల్యూ భారత్‌లో అందిస్తున్న ఎక్స్ (X) సిరీస్ వాహనాల్లో ఇదే అత్యంత ఖరీదైనది.