2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త 2021 'ఎమ్5' సెలూన్ కారుని ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించింది. మరిన్ని ఆల్ట్రా లగ్జరీ ఫీచర్లు, మోడ్రన్ డిజైన్ లాంగ్వేజ్ మరియు పవర్‌ఫుల్ ఎమ్-సిరీస్ ఇంజన్లతో ఈ అధునాత 'బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5' పెర్ఫార్మెన్స్ కారును తయారు చేశారు.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న 5-సిరీస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఎమ్5 కారును తయారు చేశారు. ఈ సరికొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు స్టాండర్డ్ మరియు కాంపిటీషన్ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ రెండు వేరియంట్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. కొత్త డిజైన్, మెరుగైన పెర్ఫార్మెన్స్ మరియు బెటర్ డైనమిక్స్ వంటి అనేక మార్పులను ఈ కొత్త కారులో గమనించవచ్చు.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పుల్లో పూర్తి అడాప్టివ్ టెక్నాలజీతో తయారు చేసిన L-ఆకారపు లేజర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్‌పై 3డి ఎలిమెంట్స్, ముందు వైపు పూర్తిగా బ్లాక్ కలర్‌లో తయారు చేసిన బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, రివైజ్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్ (నాలుగు సైలెన్సర్స్ ఉన్నట్లుగా అనిపించే డిజైన్), పెద్ద 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

MOST READ: కొత్తగా కనిపిస్తున్న మూడు కార్లు కలయికతో తయారయిన కొత్త కారు

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న పెర్ఫార్మెన్స్ M-సిరీస్‌లో టాప్ రేంజ్ మోడల్ అయిన 'బిఎమ్‌డబ్ల్యూ ఎమ్8' నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త డిజైన్‌ను తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ మోడల్‌ని చాలా రకాల ఎలిమెంట్స్ మనకు ఈ కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో కూడా కనిపిస్తాయి.

ఇక ఈ కొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు లోపలి భాగాలను పరిశీలిస్తే ఇందులో డ్రైవర్‌కు సమాచారాన్ని అందించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పూర్తిగా డిజిటల్‌గా మార్చారు. ఇంకా ఇందులో ప్రయాణీకుల వినోదం కోసం 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

MOST READ: టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

ఈ కారులో 'సెటప్' మరియు 'ఎమ్ మోడ్' రెండు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. వీటి సాయంతో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు డ్రైవింగ్ స్టైల్‌ని డ్రైవర్‌కు నచ్చినట్లుగా కాన్ఫిగర్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. డ్రైవింగ్ మోడ్స్‌ను సులువుగా యాక్సిస్ చేసుకోవటం కోసం ఇందులో కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+ మరియు ట్రాక్ అనే మోడ్స్ కూడా ఉంటాయి.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులో ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది, ఇది మంచి టచ్ అండ్ ఫీల్‌ని ఆఫర్ చేయనుంది. ఇకపోతే ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ ‌కి చెందిన లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ (బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ టెక్నాలజీ)తో పాటుగా ఆండ్రాయిడ్, యాపిల్ కనెక్టింగ్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై-బీమ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ: బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

ఇంజన్ పరంగా చూసుకుంటే.. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 స్టాండర్డ్ వేరియంట్‌లో శక్తివంతమైన 4.4 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో పవర్ బూస్ట్ కోసం రెండు టర్బోలు ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 600 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

కాంపిటీషన్ వేరియంట్‌లో కూడా ఇదే ఇంజన్‌ని ట్యూన్ చేసి ఉపయోగించారు. ట్యూనింగ్ కారణంగా ఈ ఇంజన్ గరిష్టంగా 620 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఎమ్-స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

MOST READ: ఆటోమేటిక్ ఎడిషన్‌లో రానున్న కొత్త మహీంద్రా థార్

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

బిఎమ్‌డబ్ల్యూకి చెందిన పెర్ఫార్మెన్స్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ 'ఎమ్ ఎక్స్-డ్రైవ్' ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారులోని ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ (ఏడబ్ల్యూడి) కూడా 4డబ్ల్యూడి, 4డబ్ల్యూడి స్పోర్ట్ మరియు డ్రిఫ్ట్ మోడ్ (2డబ్ల్యూడి) అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 స్టాండర్డ్ కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలో 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అదే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కాంపిటీషన్ వేరియంట్ అయితే కేవలం 3.3 సెకండ్ల వ్యవధిలో 0-100 కెఎంపిహెచ్ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈ వేగాన్ని ఆప్షనల్ ఎమ్-డ్రైవర్స్ ప్యాకేజ్ ద్వారా గంటకు 305 కిలోమీటర్లకు పెంచుకోవచ్చు.

2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 ఆవిష్కరణ; ఈ బ్యూటీ ఇండియా వచ్చేనా..?

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు రెగ్యులర్ 5-సిరీస్ కారుతో పోల్చుకుంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ కారులో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ ఉపయోగం కన్నా ఎప్పుడైనా సరదాగా జాతీయ రహదారులపై లేదా ప్రత్యేకమైన రేస్ ట్రాక్‌లపై చక్కర్లు కొట్టడానికి చక్కగా ఉంటుంది. లగ్జరీతో పాటుగా పెర్ఫార్మెన్స్ కార్లను కోరుకునే వారికి ఇది అనువుగా ఉంటుంది.

Most Read Articles

English summary
German carmaker, BMW has unveiled the 2021 M5 saloon facelift for the global market. The 2021 BMW M5 is the latest iteration of the ultimate performance variant of the brand's 5 Series range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X