బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న 'ఎక్స్‌7' ఎస్‌యూవీలో డార్క్ షాడో లిమిటెడ్ ఎడిషన్ పేరిట కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ కారుని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఆగస్టు 2020 నుండి అమెరికాలోని స్పార్టన్‌బర్గ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని, ప్రస్తుత బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మోడల్‌లో అందించే అన్ని ఇంజన్ ఆప్షన్లను ఇందులో ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. అయితే ఇంజన్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన అంశం దీని పెయింట్ స్కీమ్. ఫ్రోజెన్ ఆర్కిటిక్ గ్రే మెటాలిక్ పెయింట్‌తో ఈ కారును మొత్తాన్ని పెయింట్ చేశారు. బ్రాండ్ యొక్క హై లెవల్ పర్సనలైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగమైన బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ ఈ పెయింట్‌ను తయారు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇదివరకెన్నడూ లేనట్లుగా, ఏ ఎస్‌యూవీల్లోనైనా కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను అందించడం ఇదే మొదటిసారి.

MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్‌వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

కొత్త పెయింట్ స్కీమ్‌తో పాటు, బి మరియు సి పిల్లర్ కవర్స్, బయటి వైపు అద్దాల చుట్టూ హై గ్లోసీ ఫినిష్ షాడో లైన్‌ను కలిగి ఉంటాయి. అలాగే, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, ఎయిర్ బ్రీథర్స్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క టెయిల్ పైప్ కవర్లు వంటి ఇతర ట్రిమ్‌లు బ్లాక్ క్రోమ్‌లో ఫినిషింగ్ చేయబడి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

ఇతర ఎక్స్‌టీరియర్ మార్పులలో గ్లోసీ బ్లాక్ రూఫ్ రైల్ మరియు సన్‌రూఫ్ ఉంటాయి. ఎమ్ స్పోర్ట్స్ ప్యాకేజీతో ఏరోడైనమిక్‌గా ఆప్టిమైజ్ చేసిన బాడీవర్క్ అంశాలతో ఈ డార్క్ ఎడిషన్ రూపొందింది. ఇందులో వేర్వేరు బంపర్లు, ఎయిర్ డ్యామ్, సైడ్ స్కర్ట్స్ మరియు వి-స్పోక్ డిజైన్‌లో జెట్ బ్లాక్ మ్యాట్ ఫినిష్ తయారు చేసిన 22 ఇంచ్ ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్, పెర్ఫార్మెన్స్ టైర్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఎమ్ స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

MOST READ:రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇది ఆరు-సీట్లు లేదా ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. లోపలి భాగంలో, ట్రిమ్స్‌పై ఎమ్ స్పోర్ట్ ప్యాకేజీ డీటేలింగ్క్ కనిపిస్తాయి. ఇందులో ఎమ్ స్పెక్ లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయెల్-టోన్ మెరినో ఫుల్ లెథర్ అప్‌హోలెస్ట్రీ నైట్ బ్లూ మరియు బ్లాక్‌ కలర్ స్టిచింగ్, నైట్ బ్లూలో అల్కాంటారా ఫనిషింగ్‌తై రూఫ్ లైనర్ వంటి మార్పులు ఉన్నాయి. ఇవన్నీ బిఎమ్‌డబ్ల్యూ వ్యక్తిగత ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

వీటికి అదనంగా, అల్యూమినియం ఇన్‌సెర్ట్స్‌ మరియు ఫైన్‌లైన్ బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన సెంటర్ కన్సోల్ ఉంటుంది. ఈ ఇండివిడ్యువల్ ఇంటీరియర్ ప్యాకేజ్‌లో భాగంగా, పియానో బ్లాక్ ఫినిషింగ్‌పై ఎడిషన్ డార్క్ షాడో అనే స్పెషల్ లోగో కూడా ముద్రించబడి ఉంటుంది.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

పైన చెప్పినట్లుగానే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీలో యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎక్స్‌డ్రైవ్30డి వేరియంట్లలో 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 264 బిహెచ్‌పి శక్తిని మరియు 620 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్‌లో 3.0-లీటర్, ఇన్‌లైన్-సిక్స్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 339 బిహెచ్‌పి శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ ఎమ్50డి వేరియంట్‌లో క్వాడ్-టర్బోతో 3.0-లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 395 బిహెచ్‌పి శక్తిని మరియు 760 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి.

MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ కస్టమైజేషన్ ఆప్షన్‌ను త్వరలో సాధారణ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌7, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌6, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5 మోడళ్లకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. అర్బన్ గ్రీన్ మరియు గ్రిజియో టెలిస్టో మెటాలిక్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను బిఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది. కాగా, ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ ఆవిష్కరణ; కేవలం 500 కార్లు మాత్రమే!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 డార్క్ షాడో ఎడిషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌లో ఎక్స్7 మోడల్ అత్యంత పాపులర్ అయిన ఎస్‌యూవీ. అల్టిమేట్ లగ్జరీ, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్‌ను అందించడంలో ఇది ఎక్కడా రాజీ పడదు. రెగ్యులర్ ఎక్స్7 కారుతో పోల్చుకుంటే ఈ కొత్త ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ పేరుకు తగినట్లుగా ఆకర్షణీయమైన నలుపు రంగులో చాలా విశిష్టంగా కనిపిస్తుంది.

Most Read Articles

English summary
The BMW X7 Dark Shadow limited edition SUV has been unveiled. The automaker announced that it is only manufacturing 500 examples of the limited edition X7 for the entire world. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X