బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఇండియన్ మార్కెట్లో చాలా సంస్థలు చాలా కార్లను ప్రవేశపెట్టాయి. కానీ ప్రభుత్వ నియమాల ప్రకారం తప్పని సరిగా నిర్దిష్ట గడువులోపు బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయాలి. కానీ కొన్ని కంపెనీలు కొన్ని అనివార్య కారణాలవల్ల బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారుచేయలేనందున కొన్ని వాహనాల ఉత్పత్తులను నిలిపివేసింది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

కొన్ని సంస్థలు ఇండియన్ మార్కెట్ కోసం కొన్ని వాహనాలను బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేసింది. అంతే కాకుండా కొంతమంది కార్ల తయారీదారులు తమ చిన్న కార్లను బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ ఇంజన్లతో గడువుకు ముందే అప్‌డేట్ చేయడం జరిగింది. భారతదేశంలో కొనుగోలు చేయగల మరియు 10 లక్షల లోపు ఉన్న నాలుగు బిఎస్-6 డీజిల్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందా...

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్

బిఎస్-6 హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ మూడు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ డీజిల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు. ఇందులో 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 74 బిహెచ్‌పి శక్తిని మరియు 186 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఎఎంటి ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటాయి. ఇది మార్కెట్లో మారుతి స్విఫ్ట్ కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ మంచి ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఫోర్డ్ ఫిగో

ఇటీవల ఫోర్డ్ ఇండియా తన బ్రాండ్ అయిన ఫిగో యొక్క బిఎస్-6 వెర్షన్ ని విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కారు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఇది చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇది 1.5 లీటర్ టర్బో టర్బోచార్జ్డ్ మోటారుతో పనిచేస్తుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఈ ఇంజిన్ గరిష్టంగా 100 పిఎస్ శక్తిని మరియు 215 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 1.2 లీటర్ యూనిట్ పెట్రోల్ వేరియం లాగా కాకుండా బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారుచేయబడింది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ కారు మారుతి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఎస్యువి ఇటీవల బిఎస్-6 కంప్లైంట్ ఇంజన్లను అందుకుంది. ఫ్రీస్టైల్ తన బిఎస్-6 కంప్లైంట్ డీజిల్ మోటారును కలిగి ఉంటుంది. 1.5-లీటర్ యూనిట్ గరిష్టంగా 100 పిఎస్ శక్తిని మరియు 215 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఈ ఫోర్డ్ ఫ్రీస్టైల్ బిఎస్‌-VI ఇంజిన్‌లను ప్రవేశపెట్టడంతో పాటు 3 సంవత్సరాల వారంటీని లేదా 1 లక్ష కిలోమీర్ల స్టాండర్డ్ వారంటీని అందిస్తుంది.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

టాటా ఆల్ట్రోజ్

ఇటీవల కాలంలో ప్రారంభించిన టాటా ఆల్ట్రోజ్ చాలా చిన్న ప్రీమియం కారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది టియాగోతో పంచుకోబడిన మరియు నెక్సాన్ యొక్క 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ యొక్క డి-ట్యూన్డ్ వెర్షన్.

 బిఎస్-6 డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవే బెస్ట్ కార్స్

ఇది టాటా నెక్సాన్ మాదిరిగా కాకుండా ఆల్ట్రోజ్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ని కోల్పోయి దానికి బదులుగా 5 స్పీడ్ యూనిట్ తో లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం బిఎస్-6 కంప్లైంట్ డీజిల్ మోటార్ ని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 90 పిఎస్ శక్తిని మరియు 200 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Only 4 BS6 Diesel Hatchbacks You Can Buy In India – Altroz To Figo. Read in Telugu.
Story first published: Monday, March 2, 2020, 13:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X