బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు నేటి నుంచి అమలులో ఉన్నాయి. ఇది వరకే బిఎస్ 4 వాహనాలకు తుది గడువు 2020 మార్చి 31 అని నిర్దేశించింది. దీని ప్రకారం ఎట్టకేలకు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

భారత ప్రభుత్వం వాహన కాలుష్యాన్ని పరిష్కరించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి దేశంలో కఠినమైన ఉద్గార నిబంధనలు అమలు చేసింది.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

బిఎస్ 4 వాహనాల అమ్మకాలకు తుది గడువు ఏప్రిల్ 1, 2020 అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 2018 అక్టోబర్‌లో ప్రకటించింది. ఈ రోజు నుండి విక్రయించిన మరియు నమోదు చేసుకున్న అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార నిబంధనలను పాటించాలి. భారత ప్రభుత్వం తయారీదారులను ముందుగానే హెచ్చరించినదాని ప్రకారం బిఎస్ 6 ఇంధనాన్ని గడువుకు ముందే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

బిఎస్ 6 ప్రమాణాలు అమలులోకి రావడం వల్ల చాలామంది ఆటో తయారీదారులు డీజిల్ ఇంజిన్లను నిలిపివేశారు. ఎందుకంటే ఈ డీజిల్ ఇంజిన్లను బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారు చేయడానికి కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా ఇవి పెట్రోల్ వెర్షన్ కన్నా ఎక్కువ ధరను కలిగి ఉండటం వల్ల ఎక్కువ అమ్మకాలు కూడా జరిగే అవకాశం ఉండదు.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

చాలా మంది ఆటో తయారీదారులు తమ బిఎస్ 6 మోడళ్లను దేశంలో ఇప్పటికే ప్రవేశపెట్టారు. కానీ కొంతమంది తయారీదారులు తమ బిఎస్ 6 వెహికల్ లైనప్‌ను దేశంలో ఇంకా ప్రకటించలేదు. దేశంలో ప్రకటించిన కోవిడ్ -19 వ్యాప్తి మరియు లాక్డౌన్ కారణంగా బిఎస్ 6 వాహనాలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికలు కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

బిఎస్ 6 ప్రమాణాలు ప్రవేశ పెట్టడం వల్ల భారత మార్కెట్లో అత్యంత ప్రసిద్ధ ఇంజిన్లలో ఒకటైన ఫియట్ 1.3 లీటర్ మల్టీజెట్ టర్బో-డీజిల్ ఇంజిన్‌కు వీడ్కోలు పలికింది. ఈ ఇంజిన్ మారుతి స్విఫ్ట్, ఫియట్ పుంటో మరియు టాటా ఇండికా విస్టాలో ప్రదర్శించబడింది. ఈ ఫియట్ ఇంజిన్ని బిఎస్ 6 ఇంజిన్ గా మార్చడానికి ఎక్కువ ఖర్చు అవవుతుంది. ఈ కారణంగా దీనిని పూర్తిగా నిలిపివేయడం జరిగింది.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

దేశంలో ప్రస్తుత కరోనావైరస్ సంక్షోభం వల్ల బిఎస్ 4 వాహనాల అమ్మకం మరియు నమోదుకు గడువును పొడిగించాలని ఆటోమోటివ్ పరిశ్రమలోని వివిధ పాలక సంస్థలను సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. లాక్ డౌన్ ఫలితంగా దేశంలో అమ్ముడుపోని వాహనాల నిల్వలు చాలా ఉన్నాయి. దీని ఫలితంగా భారత ప్రభుత్వం వీటి అమ్మకాల యొక్క కాల పరిమితిని కొంత వరకు పెంచింది.

బ్రేకింగ్ న్యూస్ : ఈ రోజునుంచే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు షురూ

భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త ఉద్గార ప్రమాణాలతో కూడిన వాహనాల వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది. తక్కువ డీజిల్ వాహనాలు రోడ్లపై నడుస్తుండటంతో కాలుష్యం కూడా తక్కువగా జరిగే అవకావం ఉంటుంది. ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు నేటినుంచి మొదలైపోయాయి.

Most Read Articles

English summary
BS6 Emission Norms Come Into Effect From Today In India. Read in Telugu.
Story first published: Wednesday, April 1, 2020, 15:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X