సివిక్ డీజిల్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు హోండా ఇండియా తన బిఎస్-6 సివిక్ డీజిల్ వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త హోండా సివిక్ డీజిల్ వేరియంట్ వచ్చే జూలైలో మార్కెట్లో విడుదల కానుంది. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త హోండా కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

హోండా ఇప్పుడు ఈ బిఎస్ -6 సివిక్ డీజిల్ వేరియంట్‌ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. సివిక్ పెట్రోల్ వెర్షన్‌ను హోండా గత ఏడాది మార్చిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా సివిక్ లో 1.6-లీటర్ ఐ-డిటిఇసి టర్బో ఇంజన్ డీజిల్ వెర్షన్‌తో అమర్చబడింది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

హోండా బిఎస్-4 డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పి శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కానీ బిఎస్-6 యొక్క శక్తి మరియు టార్క్ గణాంకాలు ఇంకా వెల్లడించబడలేదు.

MOST READ:సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

మునుపటి బిఎస్-4 సివిక్ డీజిల్ వెర్షన్ ధర రూ. 20.5 లక్షలు. బిఎస్ -6 హోండా సివిక్ పెట్రోల్ ఎడిషన్ ధర రూ. 17.93 లక్షలు. కొత్త హోండా సివిక్ కారు ఆకర్షణీయమైన ఇంటీరియర్ కలిగి ఉంది.

ఇంటీరియర్ 17.7-అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంది, ఇది ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా కొత్త హోండా సివిక్ కారులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రిమోట్ ఇంజన్ స్టార్టర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లేన్ వాచ్ అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

హోండా తన సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 2020 సిటీ కారును భారతదేశంలో విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త హోండా సిటీ కారు విడుదల ఆలస్యం అయింది.

MOST READ:ఆలస్యంగా పట్టుబడ్డ ఘరానా దొంగ ; 13 బైకులు స్వాధీనం

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున కొత్త హోండా సిటీ కారు విడుదల కూడా ఆలస్యం అయింది. అయితే ఈ కొత్త కారును ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నారు.

సివిక్ డీజిల్ ఎడిసన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే

సివిక్ పెట్రోల్ వెర్షన్‌ హోండా గత ఏడాది మార్చిలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ కారణంగా హోండా డీజిల్ వెర్షన్ సివిక్‌ను విడుదల చేయనుంది. ఈ కొత్త హోండా సివిక్ కారు కూడా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించే అవకాశం ఉంది.

MOST READ:కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Starts Pre-Bookings For BS6 Civic Diesel Ahead Of Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X