పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు మహీంద్రా, తన సిరీస్‌లోని ఇతర మోడల్స్ కంటే మహీంద్రా బొలెరో అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయి. గత జూన్‌ నెలలో మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ దాదాపు 3,292 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

మహీంద్రా బ్రాండ్ యొక్క స్కార్పియో మొత్తం 2,574 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉండగా, ఎక్స్‌యూవీ 300 సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ 1,812 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. బొలెరో మహీంద్రా బ్రాండ్ లోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

మహీంద్రా తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రముఖ బొలెరో ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇది ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది.

MOST READ:కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ ఏడాది మార్చిలో బిఎస్-6 బొలెరో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బొలెరో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు.

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బిఎస్-6 బొలెరో మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బి 4, బి 6 మరియు బి 6 (ఓ). ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త బొలెరో బి 6 (ఓ) టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 8.99 లక్షలు. మహీంద్రా కంపెనీ ఈ బొలెరోను బిఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా అప్‌డేట్ చేసింది.

MOST READ:మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

కొత్త బొలెరోలోని ఫీచర్స్ గమనించినట్లయితే దీని ఫ్రంట్‌లో కొత్త బంపర్, గ్రిల్ మరియు పునఃరూపకల్పన చేసిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త బొలెరో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. కొత్త క్రాష్ టెస్ట్ సేఫ్టీ నిబంధనను పాటించటానికి బిఎస్-6 బొలెరో ఎస్‌యూవీ యొక్క వెనుక భాగం నవీకరించబడింది. ఈ కొత్త పునర్నిర్మాణం ముందు ప్రయాణీకుల భద్రతకు కూడా సహాయపడుతుంది.

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

బిఎస్ 6 మహీంద్రా బోలెరోలో 1.5 ఎల్ 3-సిలిండర్ ఎమ్హాక్ 75 డీజిల్ ఇంజన్ అమర్చబడింది. ఈ 1.5 లీటర్ ఇంజన్ 75 బిహెచ్‌పి శక్తిని మరియు 195 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఆటో రిక్షాలకు సరి & బేసి విధానం, ఎక్కడో తెలుసా ?

పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

బిఎస్-6 మహీంద్రా బొలెరో మంచి డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త బొలెరో ఎస్‌యూవీలో భద్రతా చర్యలు మరింత మెరుగుపరచబడ్డాయి. భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో బొలెరో ఒకటి.

Most Read Articles

English summary
New Bolero – Top Selling Mahindra SUV In June 2020. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X