Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో బుకింగ్స్ ఇప్పుడు కేవలం రూ. 5000 మాత్రమే
ముంబైకి చెందిన ఆటో తయారీ సంస్థ అయిన మహీంద్రా తన బిఎస్ 6 స్కార్పియో మోడళ్ల బుకింగ్స్ ప్రారంభించాయి. ఈ మహీంద్రా స్కార్పియో బుకింగ్ ధర 5,000 రూపాయలు. కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది.

మహీంద్రా బిఎస్ 6 ను కస్టమర్లు నాలుగు వేరియంట్లలో ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇందులో బాడీ హగ్గింగ్ బంపర్స్, ఫాగ్ లాంప్ గార్నిష్ సెట్, డెకాల్స్, అల్లాయ్ వీల్స్, రియర్ ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్, స్కఫ్ ప్లేట్లు, కార్పెట్ మాట్ సెట్స్ వంటి అనేక ఎంపికలతో వారి వాహనాలను యాక్సెస్ చేయగలరు.

బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో వేరియంట్లలో 2.2-లీటర్ ఎంహాక్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 140 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
MOST READ:సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

ఈ కొత్త మహీంద్రా స్కార్పియోలో క్రోమ్ ఇన్సర్ట్‌లతో ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ బెజెల్స్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్‌తో బాడీ కలర్డ్ ఓఆర్‌విఎంలు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ మరియు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్స్‌లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ స్టీరింగ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్

స్కార్పియో బిఎస్ 6 మోడళ్లలో ఎబిఎస్ విత్ ఇబిడి, పానిక్ బ్రేక్ ఇండికేటర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్ అలారం, ఓవర్ స్పీడింగ్ అలారం, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఒక ఎస్ఓఎస్ సేఫ్టీ సిస్టమ్ మరియు డైనమిక్ అసిస్టెంట్‌తో రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఇందులో ఉన్నాయి.

బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 4,456 మిమీ, వెడల్పు 1,820 మిమీ, 1,995 మిమీ ఎత్తు మరియు 2,680 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది. ఈ ఎస్‌యువి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి నాపోలి బ్లాక్, మోల్టెన్ రెడ్, డిసాట్ సిల్వర్, మరియు పెర్ల్ వైట్.
MOST READ:కరోనా నివారణలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా హర్యానా, ఇంతకీ ఏం చేసిందో తెలుసా..?

మహీంద్రా స్కార్పియో బిఎస్ 6 మోడల్స్ నాలుగు వేరియంట్లలో లభిస్తాయి. అవి ఎస్ 5, ఎస్ 7, ఎస్ 9 మరియు ఎస్ 11. సంస్థ ఇంకా ఈ ఎస్‌యూవీ ధరలను ప్రకటించలేదు. కానీ ఈ కొత్త బిఎస్ 6 స్కార్పియో ధర సుమారు 11.50 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్) తో ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నాము.

బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు