పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

బుగట్టి గత సంవత్సరం తన 110 వ వార్షికోత్సవం సందర్భంగా బుగట్టి బేబీ 2 ను తీసుకువస్తానని హామీ ఇచ్చింది మరియు గత సంవత్సరం తన 3 డి ప్రింటెడ్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు బుగట్టి బేబీ 2 యొక్క ప్రొడక్షన్ మోడల్ తీసుకు వచ్చారు.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ఈ కారు యొక్క 500 యూనిట్లు మాత్రమే విడుదల చేయబడ్డాయి మరియు మొత్తం 500 యూనిట్లు అమ్ముడయ్యాయి. బుగట్టి బేబీ 2 కారు 1927 బుగట్టి బేబీ టాయ్ కార్ ఆధారంగా రూపొందించబడింది. ఈ ఎలక్ట్రిక్ కారును తల్లిదండ్రులకు వారి పిల్లలకు గిఫ్ట్ గా ఇస్తున్నారు.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ఈ కారు పిల్లలు మరియు యువకుల కోసం మరియు ఇది అసలు టైప్ 35 మోడల్ యొక్క 75 శాతం ప్రతిరూప మోడల్. బుగట్టి బేబీ 2 లో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.

MOST READ:భారత అమ్ములపొదలో చేరిన మరో బ్రహ్మాస్త్రం : రాఫెల్ ఫైటర్ జెట్స్

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ఎవరైనా బుకింగ్‌లను రద్దు చేస్తే, మరొక కస్టమర్‌ను అనుమతించే విధంగా కంపెనీ బుకింగ్‌లు చేస్తూనే ఉంది. బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర 30,000 యూరోలు, ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 26.6 లక్షలు.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

టాప్ ఎండ్ మోడల్ ధర 58,500 యూరోలు. దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 50.7 లక్షలు. బుగట్టి బేబీ 2 కారు బుగట్టి టైప్ 35 కారుపై ఆధారపడింది. టైప్ 35 కారు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రేసింగ్ కార్లలో ఒకటి.

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

బుగట్టి బేబీ 2 బేస్, వెయిట్స్ మరియు పూర్ సెంగ్ అనే మూడు మోడళ్లలో అమ్ముడవుతోంది. బేస్ మోడల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ ప్రయాణిస్తుంది. అంతే కాకుండా ఈ కారులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 25 కిలోమీటర్లు నడుస్తుంది.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

వెయిట్స్ మరియు పూర్ సెంగ్ మోడళ్ల టాప్ స్పీడ్ గంటకు 70 కిమీ మరియు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 50 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ కార్లలోని బ్యాటరీని కొన్ని సెకన్లలో తొలగించవచ్చు.

MOST READ:రోల్స్ రాయిస్ కార్లపై ఉన్న అతిపెద్ద అపోహలు ఇవే

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ఈ కారు 2.8 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పుతో ఉంటుంది. బుగట్టి బేబీ 2 యొక్క బరువు దాని కారు మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రైవర్ లేనప్పుడు ఈ కారు బరువు 230 కిలోల వరకు ఉంటుంది.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ప్రతి ఒక్కరూ సరదాగా డ్రైవింగ్ అనుభవాన్ని పొందే విధంగా ఈ కారు రూపొందించబడింది. ఈ కారులో వెనుక చక్రాల డ్రైవ్ సిస్టం మరియు రెండు పవర్ మోడ్‌లు ఉన్నాయి.

MOST READ:కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

బుగట్టి బేబీ 2 కారు కొన్న ప్రతి ఒక్కరూ లిటిల్ కార్ క్లబ్‌లో సభ్యులుగా ఉంటారు. ఇది వారి పిల్లలు మరియు మనవరాళ్లను ప్రసిద్ధ మోటారు రేసింగ్ సర్క్యూట్లో కార్లు నడపడానికి అనుమతించబడుతుంది.

పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

కారు ఔత్సాహికులు తమ పిల్లలను కార్లను ఇష్టపడేలా చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. బుగట్టి కార్లు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. బుగట్టి బేబీ 2 కారు ఆకర్షణీయమైన క్లాసిక్ లుక్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.

Most Read Articles

Read more on: #bugatti
English summary
Bugatti launches baby 2 electric car for kids. Read in Telugu.
Story first published: Wednesday, July 29, 2020, 19:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X