Just In
- 27 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 38 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 46 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత రాష్ట్రపతి ఉపయోగించే కార్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు
భారతదేశానికి 13 వ రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తర్వాత 14 వ రాష్ట్రపతిగా 2017 లో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవిని చేపట్టారు. రాష్ట్రపతి దేశ రాజ్యాంగ అధిపతి, కావున అతనిని 'భారతదేశపు మొదటి పౌరుడు' అని కూడా పిలుస్తారు. రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు కూడా సుప్రీం కమాండర్.

దేశంలో అత్యున్నత పదవిని చేపట్టడం వల్ల రాష్ట్రపతికి బెదిరింపులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని ప్రయాణాలకు సెక్యూరిటీ కల్పించి సురక్షితమైన రాకపోకల కలిగించాలి. కాబట్టి దేశ ప్రధమ పౌరుడు అత్యంత పటిష్టమైన భద్రతలు కలిగిన మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్ (డబ్ల్యూ 221) ఉపయోగిస్తారు.

మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి మరియు దీనిని మన అధ్యక్షుడితో సహా వివిధ దేశాల ప్రముఖులు మరియు అధికారిక దేశాధినేతలు ఉపయోగిస్తున్నారు. ఎస్ 600 పుల్మాన్ రాష్ట్రపతిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని భద్రతా లక్షణాలు మరియు పరికరాలను కలిగి ఉంటుంది.
MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు కొన్న క్రిస్టియానో రొనాల్డో : ఈ కారు ధర 83 కోట్లు

ఈ కారు భారీగా భద్రతను కలిగి ఉంటుంది, ఇది విఆర్ 10 బాలిస్టిక్ రక్షణతో వస్తుంది. లిమోసిన్ కారు యజమానులను దాదాపు ఏ విధమైన దాడి నుండి అయిన కాపాడుతుంది చేతి గ్రెనేడ్ నుండి మెషిన్ గన్ వరకు రక్షించగలదు. గ్యాస్ దాడి జరిగితే యజమానులను రక్షించడానికి లిమోసిన్ లోపల ఆక్సిజన్ ట్యాంకులతో వస్తుంది. అంతే కాకుండా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వంటివి కూడా కలిగి ఉంటుంది.

ఈ బీఎండబ్ల్యూ లో ప్రొటక్షన్ కేవలం బయటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు, మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ స్టీల్ స్ప్రింగ్‌లతో రీన్ఫోర్స్డ్ సస్పెన్షన్ భాగాలతో వస్తుంది, ఇది మంచి డీక్లెరేషన్, రన్-ఫ్లాట్ టైర్లను కలిగి ఉంటుంది.
MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

రక్షణ మరియు భద్రతా పరికరాలతో పాటు, 21.3 అడుగుల పొడవైన లిమోసిన్ విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ మరియు రక్షణ కవచాలు కలిగి ఉండటం వల్ల దీని బరువు 5 టన్నులకు పైగా ఉంటుంది.

భారత రాష్ట్రపతి కారు భద్రతా కారణాల దృష్ట్యా ప్రెసిడెంట్ కారు నంబర్ ప్లేట్‌తో రాదు, కానీ స్టేట్ ఎంబెల్మ్‌ను కలిగి ఉంటుంది. ఇవన్నీ భారత రాష్ట్రపతి భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.
MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ 6.0 లీటర్ వి 12 బిటుర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం భారత రాష్ట్రపతి ఉపయోగించే మోడల్ పాత తరం వెర్షన్, ఇది 530 బిహెచ్‌పి మరియు 830 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాష్ట్రపతి తన పుల్మాన్ లేటెస్ట్ తరం మోడల్‌కు అప్‌గ్రేడ్ చేస్తారని భావించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి మరియు దేశంలో ఆర్థిక సంక్షోభం మధ్య, అతను కొత్త కారును కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. లేటెస్ట్ వెర్షన్ మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ గార్డ్ (డబ్ల్యూ 222) కు రూ. 10 కోట్లకు పైగా ఖర్చవుతుందని, అధ్యక్షుడు కోవింద్ ఈ మొత్తాన్ని బదులుగా కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
MOST READ:కేరళలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

2007 - 2012 మధ్య సేవలందించిన భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కాలం నుంచి మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 పుల్మాన్ అధికారిక కారు. మాజీ అధ్యక్షుడు ప్రతిభా పాటిల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ నుండి ఎస్ 600 పుల్మాన్ గార్డ్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. క్లాస్ డబ్ల్యు 140 లిమోసిన్ మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం కూడా ఉపయోగించారు.