మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం బిఎస్ 4 వాహనాలకు ఇచ్చిన తుది గడువు 2020 మార్చి 31. తరువాత ఏప్రిల్ 01 నుంచి బిఎస్ 4 విక్రయాలు నిలిపివేయటం జరుగుతుంది. బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి అన్ని కంపెనీల వాహనాలు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారు చేయాలి.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

చాలా కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేసారు. కానీ కొన్ని కంపెనీలు తమ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయలేకపోయాయి. ఈ క్రమంలో ఈ వాహనాలను నిలిపివేయడం జరిగింది. ఈ వాహనాలు ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. ఇకపై అందుబాటులో లేని వాహనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

సాధారణంగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో బిఎస్ 4 నుండి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు పరివర్తన చెందుతున్నందున, చాలా వాహనాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ 1 నుండి బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్లు కలిగిన కార్లను మాత్రమే దేశంలో నమోదు చేసుకోవచ్చు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మరుగున పడనున్న 7 కార్లు ఇక్కడ ఉన్నాయి.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

టాటా సఫారీ స్టోర్మ్

టాటా సఫారీ మొదటిసారి 1998 లో తిరిగి ప్రారంభించింది. స్టోర్మ్ అవతార్ 2012 లో ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌గా వచ్చింది. 7 సీట్లు కలిగిన ఈ వాహనాలను సైనిక దళాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ వాహనాలు ఎలాంటి రోడ్లలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

ఈ వాహనాలను ఆర్మీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిని బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా మార్చడానికి వీలు లేకపోవడం వల్ల ఇవి కూడా త్వరలో మరుగున పడే అవకాశం ఉంది.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

హోండా బిఆర్-వి

హోండా 7 సీట్ల బిఆర్-వి కారు 2016 లో లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసినప్పుడు భారతీయ మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ కారులో సివిటి వేరియంట్‌తో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు కలిగి వుంది. కానీ ఇప్పుడు వీటిని బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేయలేకపోవడం వల్ల దీనిని నిలిపివేయనున్నారు.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

టయోటా కొరోల్లా ఆల్టిస్

టయోటా ఆల్టిస్ కాంపాక్ట్ మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో మంచి డిమాండ్ ఉన్న వాహనం. ఇది ఈ విభాగంలో మెరుగైన ప్రదర్శనకారులలో ఒకటి. ఇది బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయలేకపోవడం వల్ల ఈ వాహనం ఇకపై మార్కెట్లో లభించే అవకాశం లేదు.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

టయోటా ఎటియోస్ / లివా

భారతదేశంలోని టయోటా నుండి వచ్చిన చాల వాహనాలు అతి తక్కువ కాలంలో ప్రజల యొక్క అభిమానాన్ని పొందింది. ఈ టయోటా అత్యంత సరసమైన కార్లు కూడా అందించినప్పటికి ఎక్కువ సంఖ్యలో అమ్ముడు కాలేదు. నాణ్యత పరంగా వారు ఇచ్చే వాటికి ఎక్కువ ధర నిర్ణయించారని చాలామంది భావించారు. టయోటా ఇండియా లైనప్‌లో భాగంగా ఈ కార్లు దాదాపు ఒక దశాబ్దం గడిపాయి.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం బిఎస్ 4 వాహనాలన్ని బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయాలి. కానీ వీటిని బిఎస్ 6 వాహనాలుగా తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా దేనిని బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయలేకపోవడం వల్ల వీటిని పూర్తిగా నిలిపివేయడం జరిగింది.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

టాటా జెస్ట్

టాటా మోటార్స్ నుండి వచ్చిన కాంపాక్ట్ సెడాన్ 2014 లో తిరిగి వచ్చినప్పుడు కంపెనీ కొత్త ఇంపాక్ట్ డిజైన్ తో వచ్చిన మొదటి కార్లలో ఒకటి. కానీ ఇది ప్రారంభం నుంచి కూడా చాలా కష్టతరమైనదిగా ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత అదే స్థలంలో మరింత అధునాతన టైగర్ ప్రారంభించబడింది. అదేవిధంగా ఇది బిఎస్ 6 అప్‌గ్రేడ్‌ను పొందకపోవడం వల్ల ఇది కూడా ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండదు.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

వోక్స్వ్యాగన్ అమియో

వోక్స్వ్యాగన్ అమియో చాలా ఆలస్యంగా వచ్చిన సబ్-కాంపాక్ట్ సెడాన్. ఇది అప్డేటెడ్ ఇంజన్లు మరియు అద్భుతమైన గేర్‌బాక్స్‌తో వచ్చింది. ఈ కారు కొంచెం ఎక్కువ ధరలు కలిగి ఉంది. ఈ కారణంగా చాలామంది దీనిని కొనుగోలు చేయలేదు.

మీకు తెలుసా.. ఈ 7 కార్లు ఇకపై అందుబాటులో ఉండవు

రెనాల్ట్ లాడ్జీ

రెనాల్ట్ లాడ్జీ 5 సంవత్సరాల క్రితం లాంచ్ అయిన కారు. ఇది డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. అంతే కాకుండా ఇందులో 7 సీట్లు ఉన్నాయి. రెనాల్ట్ టయోటా ఇన్నోవాను పోలి ఉంటుంది. ఇప్పుడు నిబంధనల ప్రకారం రెనాల్ట్ వారి డీజిల్ ఇంజిన్ బిఎస్ 6 ను అనుకూలంగా మార్చడానికి వీలు లేదు, కావున దీనిని నిలిపివేయడం జరిగింది.

పైన పేర్కొన్న ఈ ఏడు కారు ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండదు.

Most Read Articles

English summary
BS6 Emission Norms: 7 Cars You Will Not See Again At A Showroom Near You. Read in Telugu.
Story first published: Thursday, April 2, 2020, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X