టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

ముంబైకి చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ సియట్ టైర్స్, కరోనా వైరస్‌ను నివారించేందుకు ఓ సరికొత్త ఫేస్ మాస్క్‌ను విడుదల చేసింది. 'గోసేఫ్ ఎస్95' పేరుతో సియట్ విడుదల చేసిన ఈ ఫేస్ మాస్క్‌తో కంపెనీ ఆరోగ్య పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టినట్లయింది. సియట్ గోసేఫ్ ఎస్95 ఫేస్ మాస్క్‌ను రూ.249 ధరతో విక్రయిస్తున్నారు.

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

కొత్త సియట్ గోసేఫ్ ఎస్95 ఫేస్ మాస్క్‌ను ఆరు పొరలతో (లేయర్స్) నిర్మించారు. ఇందులో చివరి లోపలి పొర లేదా వినియోగదారు ముఖాన్ని తాకినట్లు ఉండే మృదువైన పొరను యాంటీ బాక్టీరియల్ క్లాత్‌తో తయారు చేశారు. ద్రాని క్రింది మూడు పొరలు సూక్ష్మజీవుల నుండి రక్షణను అందిస్తాయని, వాటిని మైక్రో ఫిల్టర్ల సాయంతో తయారు చేశామని సియట్ తెలిపింది. ఎయిర్ మెష్‌ను కలిగి ఉన్న చివరి పొర దుమ్ము కణాలు మరియు ఇతర కలుషితాలను ఫిల్టర్ చేయడానికి రూపొందించబడింది.

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

ఈ ఫేస్ మాస్క్‌లో సర్దుబాటు చేయగల నోస్ క్లిప్ కూడా ఉంటుంది. ఫలితంగా ముక్కు పైనుండి జారిపోకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. శ్వాసక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేలా మరియు తుంపర్లను నిరోధించేలా ఈ మాస్క్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ వివరించింది. ఈ మాస్క్‌ను 30 సార్ల వరకూ ఉతికి, తిరిగి వాడవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌ను మరియు ఇతర వ్యక్తిగత వస్తువులను కూడా నిల్వ చేసుకునేందుకు సియట్ ఓ మల్టీ-యుటిలిటీ క్లాత్ బ్యాగ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

MOST READ: త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

రూ.249 ధరతో విడుదలైన సియట్ గోసేఫ్ ఎస్95 ఫేస్‌మాస్క్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సీనియారిటీ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో లభిస్తుంది. అలాగే సియట్ అధీకృత డీలర్‌షిప్‌లలో కూడా గోసేఫ్ ఎస్95 మాస్క్ అందుబాటులో ఉంటుంది.

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

సియట్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, బ్రాండ్ ఇటీవలే తమ జూమ్ ఎక్స్‌ఎల్ శ్రేణి టైర్లను ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం ప్రత్యేకంగా విడుదల చేసింది. టార్క్ టిఎక్స్6 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం మొట్టమొదటి సారిగా ప్రత్యేకమైన టైర్లను తయారు చేశారు. ఈ రెండు బ్రాండ్లు కూడా కొత్త టైర్లను విస్తృతంగా పరీక్షించాయి. ఈ టైర్లు తక్కువ రోలింగ్ నిరోధక లక్షణాలు కలిగి ఉండి బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అలాగే మోటార్‌సైకిల్ రేంజ్‌ని పెంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ బ్రాండ్ తరువాతి తరం జూమ్ ఎక్స్‌ఎల్ టైర్లను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉంది.

MOST READ: నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ టార్క్ తమ టిఎక్స్6 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించిన సమయంలోనే ఈ కొత్త టైర్లను విడుదల చేసింది.

జనరల్ ట్రివియా

సాధారణంగా సియట్ అని పిలిచే ఈ కంపెనీ పూర్తి పేరు - కెవీ ఎలక్ట్రిక్ ఇ అఫిని టొరినో. ఇది ఆర్‌పిజి గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ. సియట్ ఇటలీలో 1924లో స్థాపించబడింది ఆ తర్వాత 1958లో మాత్రమే సియట్ టైర్స్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది. ప్రయాణీకుల వాహనాలు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు మరియు బస్సులు, ట్రాక్టర్లు, ట్రైలర్స్, ఆటోరిక్షాల కోసం ఈ బ్రాండ్ సంవత్సరానికి 165 కోట్లకు పైగా టైర్లను ఉత్పత్తి చేస్తుంది.

టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

సియట్ గోసేఫ్ ఎస్95 ఫేస్ మాస్క్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కునేందుకు ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం నివారణ మాత్రమే. మన జాగ్రత్తలో మనం ఉండి ఈ మహమ్మారితో పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు మనం చేయాల్సిన ముఖ్యమైన పని మంచి ఫేస్ మాస్క్‌ను ధరించడం. ఈ నేపథ్యంలో, సియట్ తయారు చేసిన మల్టీ లేయర్ ఫేస మాస్క్‌ కాలుష్యం నుంచే కాకుండా వైరస్‌ల నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ ఇస్తుందని మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Mumbai based tyre manufacturer, CEAT Tyres has launched its GoSafe S95 face mask, effectively making an entry into the Health Industry. The CEAT GoSafe S95 face mask has been launched at Rs 249. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X