Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టైర్ల దిగుమతిపై ప్రభుత్వ ఆంక్షలు; స్థానిక తయారీకే మద్దతు!
భారతదేశంలో టైర్ల దిగుమతిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు మరియు బస్సులలో ఉపయోగించే న్యుమాటికి టైర్ల దిగుతిపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దేశీయంగానే ఈ టైర్లను తయారు చేయాలని, స్థానిక కొనుగోళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఇకపై ఇలాంటి టైర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్స్ పొందటంతో అనుమతులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

టైర్ల దిగుమతిపై ఆంక్షలు విధించక మునుపు అంతర్జాతీయ టైర్ కంపెనీలు భారత్‌లోకి వివిధ దేశాల్లో తయారైన టైర్లను దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించే వారు. ఫలితంగా చైనా మరియు దక్షిణ ఆసియా దేశాల నుంచి టైర్ల దిగుమతి గణనీయంగా పెరిగింది.
MOST READ: కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.33.10 కోట్ల విలువైన టైర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ దిగుమతులు కేవలం 26.10 కోట్లు మాత్రమే నమోదైయ్యాయి.

స్థానికంగా టైర్ల తయారీని ప్రోత్సహించడం మరియు నిత్యావసరం కాని వస్తువులపై దిగుమతి బిల్లులను తగ్గించుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు దిగుమతులు రూ.46,700 కోట్లకు పెరిగాయి, మేక్-ఇన్-ఇండియా ప్రణాళికతో ఇవి 10 శాతం తగ్గాయి.
MOST READ: 16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

కోవిడ్-19 తర్వాత దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రధాని మోడీ 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'వోకల్ ఫర్ లోకల్' అనే రెండు ప్రణాళికలను ప్రకటించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతానికి కేవలం టైర్ల దిగుమతిపైనే ఆంక్షలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి ఇతర ఉత్పత్తులపై కూడా మరిన్ని ఆంక్షలను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాహనాల తయారీలో ఉపయోగించే విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు కొన్నిరకాల బ్యాటరీలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న సందర్భాలున్నాయి. ఇలాంటి విడిభాగాలన్నీ వాహనాల తయారీలో చాలా కీలకమైనవి. వీటిని స్థానికంగానే తయారు చేయటం మరియు కొనుగోలు చేయటం వలన దేశ ఆర్థిక వ్యవస్థను వీలైనంత వేగంగా పునరుద్ధరించవచ్చు.
MOST READ: తగ్గిన డిమాండ్, టాటా టియాగో, టిగోర్ జెటిపి మోడళ్ల నిలిపివేత!

టైర్ల గురించి ఓ ఫ్యాక్ట్స్:
న్యుమాటిక్ టైర్లను సింథటిక్ రబ్బర్, సహజ రబ్బర్, ఫ్యాబ్రిక్ మరియు వైర్, కార్బన్ బ్లాక్‌లను ఉపయోగించి తయారు చేస్తారు. బాడీ (రబ్బర్) మరియు థ్రెడ్ (వైర్ల) కలయికతో రూపొందిన న్యుమాటిక్ టైర్లలో బాడీ కంప్రెస్డ్ ఎయిర్‌తో కంటైన్‌మెంట్‌ను మరియు థ్రెడ్ ట్రాక్షన్‌ను అందిస్తుంది.

టైర్ల దిగుమతులపై కేంద్ర ఆంక్షలు విధించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటుగా ఇండియాలోనే తయారైన వస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిగుమతులపై ఆంక్షలు విధిస్తూనే స్థానిక సంస్థలకు ప్రభుత్వం మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తే ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందనేది మా అభిప్రాయం.