చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్ని అనిశ్చితి ఆటోమొబైల్ పరిశ్రమపై కూడా పడనుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, దేశంలో వాహనాల ఉత్పత్తి ఆలస్యం అవుతుందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

ఓరియంట్ నుండి దిగుమతి చేయబడిన అన్ని విడి భాగాలను ఇప్పుడు మాన్యువల్ తనిఖీలకు లోబడి ఉంటాయి, వీటికి క్లియరెన్స్ సర్టిఫికెట్ రావటంలో ఆలస్యం అవుతుంది. ఈ కొత్త విధానం వలన పరిశ్రమలో ఇప్పటికే అస్థిరమైన సప్లయ్ చైన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

ఈ విషయంపై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్ రాజన్ వాధేరా మాట్లాడుతూ, "ఓడరేవు వద్ద రద్దీ కారణంగా క్లియరెన్స్‌లో అధిక జాప్యం జరగడం, అది చివరికి భారతదేశంలో వాహనాల తయారీని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే పరిశ్రమ వృద్ధి తగ్గుముఖంలో ఉంటే, తాజా నిర్ణయంతో వాహనాల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి ఈ వృద్ధి రేటు మరింత క్షీణించే అవకాశం ఉందని" అన్నారు.

MOST READ: ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్‌టాప్ కమర్షియల్ మోడల్ ఖరారు - వివరాలు

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎసిఎంఎ) అధ్యక్షుడు మిస్టర్ దీపక్ జైన్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఆటోమోటివ్ వాల్యూ చైన్ చాలా క్లిష్టమైనది, సమగ్రమైనది మరియు పరస్పర ఆధారితమైనది, వాహన తయారీకి అవసరమైన ఒక్క భాగం కూడా లభించకపోయినా వాహన ఉత్పత్తి నిలిచిపోతోంది."

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

"లాక్డౌన్ తరువాత, వాహన అమ్మకాల పెరుగుదలకు అనుగుణంగా కాంపోనెంట్ పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా నిర్ణయం ఇటు పరిశ్రమకు అటు ఆర్ధికవ్యవస్థకు కలిగే మంచి ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తుందని" ఆయన చెప్పారు.

MOST READ: కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

భారతదేశంలో ఆటోమోటివ్ సప్లయ్ చైన్ విలువ సుమారు 118 బిలియన్ డాలర్లు, వీటిలో విడిభాగాల దిగుమతులు 4.75 బిలియన్ డాలర్లు, ఇది మొత్తం ఆటో ఇండస్ట్రీ టర్నోవర్‌లో సుమారు 4 శాతంగా ఉంటుంది.

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

ఇంజన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు వంటి కొన్ని క్లిష్టమైన భాగాలను చైనా నుండి దిగుమతి అవుతున్నాయని, దేశీయ భాగాల తయారీదారుల వద్ద ఇప్పటికీ అలాంటి విడిభాగాలు అందుబాటులో లేవని సియామ్ తెలిపింది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

ఆటోమొబైల్ కంపెనీలు స్థానికంగా తయారు చేసే మోడళ్ల విషయంలో విడిభాగాలన్నీ దాదాపు లోకల్‌గానే లభ్యమవుతాయి కాబట్టి అలాంటి మోడళ్లు ఈ ప్రభావాన్ని తట్టుకుంటాయి. కాకపోతే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడిన మోడళ్లు మాత్రం ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ప్రీమియం విభాగంలోని వాహనాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం

చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది శుభవార్త కాదు. దిగుమతులపై ఆంక్షలు విధించడం వెనుక ఉన్న భావోద్వేగాలను మేము అర్థం చేసుకున్నప్పటికీ, వాటిని దాదాపు తక్షణ ప్రాతిపదికన అమలు చేయడం వలన ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు ఆర్థిక మాంద్యంతో పోరాడుతున్న పరిశ్రమను ఇది ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పరిశ్రమను ఆదుకునేందుకు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Most Read Articles

English summary
The Society of Indian Automobile Manufacturers has said that one could expect a delay in production of vehicles because of component import restrictions imposed on China. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X