కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న భయంకరమైన మహమ్మారి "కరోనా వైరస్". చైనాలో పుట్టి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోయింది. ఈ వైరస్ వల్ల చాలా దేశాలలో చాలా మంది ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ కరోనా వైరస్ కేవలం ప్రజలను మాత్రమే కాకుండా దీని ప్రభావం ఆటో ఉత్పతులపై సైతం చూపిస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల చైనాలో వాహనాల యొక్క అమ్మకాల శాతం రోజురోజుకి పడిపోతున్నాయి.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

కరోనా వైరస్ ప్రభావం వల్ల అధిక వాహనాలు తయారయ్యే చైనా దేశంలో అమ్మకాలు ఒక్క జనవరి నెలలో మాత్రం 18 శాతం పడిపోయాయి. ఎందుకంటే చైనాలో ఎక్కువ వాహనాలు తయారవుతాయి. వీటికి కావలసిన మెటీరియల్స్ అన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. ఈ దిగుమతులు ఆలస్యం కావడం మాత్రమే కాకుండా ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తులు కూడా ఆలస్యం చేశారు.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

చైనాలో ఒక్కసారిగా 18 శాతం అమ్మకాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ వ్యాప్తి అని కంపెనీ ప్రకటించింది. ఇవే కాకుండా కొత్త ఎనర్జీ వాహనాల అమ్మకాలు కూడా దాదాపు 54.4 శాతంపడిపోయాయి . చైనాలో ఈ విధంగా అమ్మకాలు తగ్గిపోవడం వరుసగా ఇది 7 వ నెల అని చైనా అసోసియేషన్ ఆఫ్ ఆటోమొబైల్ తయారీదారులు తమ ప్రాథమిక సమాచారం చూపించారు.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

చైనాలోని స్థానిక ప్రభుత్వాలు జనవరి చివరి రెండు వారాలలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ సంచరించడం నిషేధితం అని అక్కడి నివాసితులను హెచ్చరించింది. ఇది అంటూ వ్యాధి కావున ప్రజలు ఎక్కువ ఎక్కువ అప్రమత్తంగా ఉన్నారు. ఈ విధంగా కరోనా వైరస్ వల్ల మొదటి త్రైమాసికంలో అమ్మకాలు మాత్రమే కాకుండా ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ కరోనా వైరస్ వల్ల చాల మంది ఉత్పత్తి దారులు సెలవులు తీసుకోవడం వల్ల ఉత్పత్తులు తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

చైనాలోని హుబీలో చైనాలో జరిగే ఉత్పత్తులలో దాదాపుగా 9 శాతం ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. ఈ కేంద్రం యొక్క భాగస్వాములు డాంగ్ఫెంగ్ మోటార్ గ్రూప్ కో లిమిటెడ్, హోండా మోటార్ కో లిమిటెడ్, రెనాల్ట్ ఎస్‌ఐ మరియు ప్యుగోట్ ఎస్‌ఐలు ఉత్పత్తులు కూడా ఆలస్యం అయింది.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

హుబీలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతర వాహన తయారీదారులైన నిస్సాన్ మోటార్ కో లిమిటెడ్, డాంగ్ఫెంగ్ మరియు జనరల్ మోటార్స్ కోతో ప్లాంట్ కూడా ఉన్నాయి. వీటి ఉత్పత్తులు కూడా కరోనా ప్రభావం వల్ల ఆలస్యం జరిగింది.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

గత నెలలో షాంఘైలోని తన 2 బిలియన్ డాలర్ల ప్లాంట్‌లో నిర్మించిన కార్లను పంపిణీ చేయడం ప్రారంభించిన టెస్లా ఇంక్, చైనా నిర్మించిన మోడల్ 3 లను ర్యాంప్-అప్ చేయడంలో కేవలం ఒకటిన్నర వారాల ఆలస్యాన్ని సూచించింది. ఇది స్థానిక ప్రభుత్వం సహాయంతో షాంఘైలో సోమవారం ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం జరిగింది. పడిపోయిన అమ్మకాలను తిరిగి అభివృద్ధి చేసే దిశలో చైనా సంస్థలు అన్ని ఆలోచిస్తున్నాయి.

కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా పరిశ్రమలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా దేశాల పారిశ్రామిక రంగాలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కువగా చైనాలో ఎక్కువ ఉత్పత్తులు నిలిచిపోవడమే కాకుండా అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయాయి. తగ్గిపోయిన అమ్మకాలను మళ్ళీ పెంచుకే దిశలో అన్ని కంపెనీలు ఉత్పత్తులను మళ్ళీ మొదలు పెట్టాయి. కరోనా దెబ్బకి ప్రజలు మాత్రమే కాదు పరిశ్రమలు కూడా విలవిల్లాడిపోతున్నాయి.

Most Read Articles

English summary
Coronavirus Outbreak: China Auto Sales Plunged by 18 Per Cent in January. Read in Telugu.
Story first published: Thursday, February 13, 2020, 16:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X