ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిని ముప్పుతిప్పలు పెడుతున్న వైరస్ "కరోనా". ఈ వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ వైరస్ ప్రజల పాలిట అనుదిన గండంగా మారింది. కరోనా వైరస్ ఒక్క ప్రజలకు మాత్రమే ఇబ్బందులు కలిగించడం లేదు. కొన్ని సంస్థలు కూడా ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఉత్పత్తులు నిలిచిపోయాయి. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఫిబ్రవరి నెల ఎంజి హెక్టర్ యొక్క ఉత్పత్తి మరియు సరఫరాలు కూడా నిలిచిపోయాయి. ఎంజి హెక్టర్ కంపెనీ యూరోపియన్, చైనీస్ మరియు ఆసియా అమ్మకందారులనుంచి విడి భాగాలను దిగుమతి చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ దిగుమతికి అంతరాయం కలిగింది. ఇది పిబ్రవరి నెలలో ఉత్పత్తులు నిలిచిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

ఎంజి మోటార్ ఇండియా నివేదికల ప్రకారం యూరోపియన్, చైనీస్ మరియు ఆసియా నుంచి కరోనా వైరస్ ప్రభావం వల్ల దిగుమతులు నిలిచిపోవడం జరిగింది. ఒక్క ఉత్పత్తులు మాత్రమే తగ్గిపోవడం కాకుండా ఫిబ్రవరిలో అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయాయి.

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

ఎంజి బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి అయిన ఎంజి హెక్టర్ ఇండియన్ మార్కెట్లో 2019 మధ్యలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటినుంచి ఇండియన్ మార్కెట్లో ఈ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఉత్పత్తికి మరియు అమ్మకాలకు అంతరాయం కలగటానికి కరోనా వైరస్ ప్రభావాన్ని చూపించింది. ఈ ప్రభావం వల్ల వినియోగదారులు ఈ వాహననాలకోసం కొంతకాలం నిరీక్షించవలసి ఉంది.

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను గడగలాడిస్తుంది. చైనాలోని వుహాన్ కేంద్రంగా ఉన్న కరోనా వైరస్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజా ఆరోగ్య దృష్ట్యా దీనిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో కేసులను ద్రువీకరించినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

రాబోయే 2020 ఆటో ఎక్స్‌పోలో ఎంజి మోటార్ ఇండియా కూడా పాల్గొంటుంది. ఇంజి ఇండియా ఆటో ఎక్స్‌పోలో ‘గ్లోస్టర్' ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. మాక్సస్ డి 90 ఆధారంగా కొత్త ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీని ఆరు లేదా ఏడు సీట్ల ఎస్‌యూవీగా అందించనుంది. ఇది టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి వాటికి భారత మార్కెట్లో ప్రత్యర్థిగా ఉండబోతోంది.

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

ఎంజి బ్రాండ్ నుంచి 'హెక్టర్ మరియు జెడ్ఎస్ ఇవి ఎస్‌యువి'ల తరువాత "ఎంజి గ్లోస్టర్" మూడవ ఉత్పత్తి. ఆల్-ఎలక్ట్రిక్ జెడ్ఎస్ ఎస్‌యూవీని ఇటీవల కాలంలో ఇండియాలో ప్రారంభించడం జరిగింది. దీని ధర రూ. 20.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 లో పిబ్రవరి నెల ఎంజి మోటార్ ఇండియాకి కఠినమైన నెలగా ఎదుర్కోవలసి వచ్చింది. ఎంజి హెక్టర్ ఉత్పత్తులు నిలిచిపోవడం వల్ల ఇది వినియోదారులపై అంతరాయం కలిగించింది. నవంబర్ లో ఉత్పత్తి సామర్త్యం బాగా పెరిగింది. కానీ ఫిబ్రవరిలో మాత్రం కరోనా వైరస్ ప్రభావం వల్ల ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

Most Read Articles

English summary
Coronavirus Outbreak Could Disrupt Production Of MG Hector Causing Increased Waiting Periods. Read in Telugu.
Story first published: Monday, February 3, 2020, 14:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X