భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ విభాగంలో అత్యంత పోటీతో కూడుకున్నది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం. ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అతికొద్ది మోడళ్లు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ విభాగంలో అనేక కొత్త మోడళ్లు వచ్చాయి, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

గడచిన నవంబర్ నెలలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకూ అగ్రస్థానంలో కొనసాగిన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. నెంబర్ వన్ స్థానాన్ని ఇటీవలే వచ్చిన కియా సోనెట్ దక్కించుకుంది. ఈ విభాగంలో మొత్తం అమ్మకాలు 41 శాతం పెరిగి 31,585 యూనిట్ల నుండి 44,379 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ కథనంలో మోడల్ వారీ వివరాలను తెలుసుకుందాం రండి.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

కియా సోనెట్

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో సంచలనం సృష్టించిన మోడల్ కియా సోనెట్. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ మరియు సరసమైన ధరతో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ ఈ విభాగంలో ఇప్పటి వరకూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న మారుతి సుజుకి విటారా బ్రెజ్జాను ఓడించి అగ్రస్థానాన్ని కైవశం చేసుకుంది. గత నవంబర్ 2020లో కియా మోటార్స్ మొత్తం 11,417 యూనిట్ల సోనెట్ కార్లను విక్రయించింది.

MOST READ:ఈ రంగంలో బెంగళూరు ప్రపంచంలోనే నెం. 1 స్థానం పొందింది ; ఏ రంగంలోనో తెలుసా ?

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

హ్యుందాయ్ వెన్యూ

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో నిలిచింది హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ. గత నెలలో మొత్తం 9265 యూనిట్ల హ్యుందాయ్ వెన్యూ వాహనాలను అమ్ముడయ్యాయి. అయితే అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో (నవంబర్ 2019తో) పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 4 శాతం క్షీణించాయి. ఆ సమయంలో కంపెనీ 9665 యూనిట్లను విక్రయించింది. ఒక సంవత్సరం కాలంలోనే ఈ మోడల్ లక్ష యూనిట్ల మైలురాయిని కూడా చేరుకుంది.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి సెగ్మెంట్ లీడర్‌గా కొనసాగిన మారుతి సుజుకి విటారా బ్రెజ్జా గడచిన నవంబర్ నెలలో అమ్మకాల పరంగా మూడవ స్థానానికి జారిపోయింది. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 35 శాతం తగ్గాయి. నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 7838 యూనిట్ల బ్రెజ్జా వాహనాలను విక్రియంచింది. గత సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 12,033 యూనిట్లుగా ఉంది.

MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ నుండి లభిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తోంది. గడచిన నవంబర్ 2020లో టాటా నెక్సాన్ అమ్మకాలు అనూహ్యంగా 75 శాతం పెరిగాయి. ఈ సమయంలో కంపెనీ 6021 యూనిట్లు నెక్సాన్ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య కేవలం 3437 యూనిట్లుగా మాత్రమే ఉంది.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

మహీంద్రా ఎక్స్‌యూవీ300

యుటిలిటీ వాహనాల తయారీలో పేరుగాంచిన మహీంద్రా బ్రాండ్, తమ పాపులర్ ఎక్స్‌యూవీ500 నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300. పెద్ద ఎస్‌యూవీ మాదిరిగానే స్టైలిష్‌గా కనిపించే మహీంద్రా ఎక్స్‌యూవీ300 గడచి నవంబర్ 2020 నెల అమ్మకాల్లో 100 శాతం వృద్ధిని నమోదు చేసి 4458 యూనిట్లను విక్రయించింది.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

టొయోటా అర్బన్ క్రూయిజర్

మారుతి సుజుకి - టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ కంపెనీల ఉమ్మడి భాగస్వామ్యం నుంచి వచ్చిన రెండవ మోడల్ టొయోటా అర్బన్ క్రూయిజర్ (మొదటిది గ్లాంజా). విటారా బ్రెజ్జాని కాస్తంత మోడిఫై చేసి అర్బన్ క్రూయిజర్‌గా పేరు మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ గడచిన నవంబర్ 2020లో 2832 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఒకప్పుడు అద్భుతంగా అమ్ముడుపోయిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అమ్మకాలు ఇప్పుడు క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. గడచిన నవంబర్ 2020లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అమ్మకాలలో 44 శాతం క్షీణించి 1590 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫోర్డ్ ఇండియా ఇటీవలే తమ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

MOST READ:ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

హోండా డబ్ల్యూఆర్-వి

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ హోండా డబ్ల్యూఆర్-వి అమ్మకాల పరంగా ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. గడచిన నవంబర్ 2020 నెలలో హోండా కేవలం 958 యూనిట్ల డబ్ల్యూఆర్-వి వాహనాలను మాత్రమే విక్రయించింది. హోండా ఇటీవలే డబ్ల్యూఆర్-వి 'ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్' పేరుతో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధరను రూ.9.70 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించారు.

భారతదేశంలో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..

నవంబర్ 2020లో టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న విభాగాల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం చాలా ప్రధానమైనది. గడచిన నవంబర్ నెలలో కియా సోనెట్ మారుతి సుజుకిని ఓవర్‌టేక్ చేయగా, టాటా నెక్సాన్ ఈ విభాగంలోని మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మోడళ్లను ఓవర్‌టేక్ చేసింది. ఈ విభాగంలో ఇటీవలే నిస్సాన్ మాగ్నైట్ విడుదల కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో రెనో కిగర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు మోడళ్ల రాకతో ఈ విభాగంలో పోటీ మరింత తీవ్రం కానుంది.

Most Read Articles

English summary
Top compact SUV sales in November 2020; Kia Sonet leads the segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X