కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచదేశాలన్నిటిలోనూ విస్తరించి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కవగా ఉంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. భారతదేశంలో కరోనా నివారణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దీనిని పూర్తిగా నివారించలేకపోతున్నారు.

కరోనా వైరస్ పై అవగాహనా కల్పించడానికి తమిళ నాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో మరో వినూత్నమైన చర్య చేపట్టారు. కరోనా అవగాహన కోసం తెలంగాణాలో జరిగిన సంఘటనను గురించి పూర్తిగా తెలుసుకుందాం..!

కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

భారతదేశంలో రోజు రోజుకి మరింత ఎక్కువగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించడం కోసం బహదూర్‌పురలోని సుధా కార్స్ మ్యూజియంకు చెందిన కన్యాబొయినా సుధాకర్ ఒక ‘కరోనా కారు' రూపొందించారు. "కోవిడ్ -19 యొక్క వ్యాప్తిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఈ కారుని తరాలు చేసారు.

కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

ఈ కారు కరోనా వైరస్ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది ప్రజలకు సామాజిక దూరం గురించి అవగాహన పెంచుకునేలా ప్రజాదరణ పొందింది అని సుధాకర్ చెప్పారు.

MOST READ: బిఎస్ 6 ఎక్స్‌ప్లస్ 200 బైక్ స్పెసిఫికేషన్స్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్

కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఈ కరోనా కారును బుధవారం ఆవిష్కరించనున్నారు. పోలీసులతో సహా ప్రభుత్వ సంస్థలు ఆసక్తి చూపిస్తే, కారును ఉపయోగించాలని తాను కోరుకుంటున్నాను, తద్వారా సందేశం ప్రజలకు తెలియజేయబడుతుందని తెలిపాడు.

కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

ఈ కరోనా కారును 100 సిసి ఇంజిన్‌తో రూపొందించారు. ఇది సిక్స్ వీలర్, ఇది ఒకే సీటు, ఫైబర్ బాడీని కలిగి ఉంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నేను దీన్ని తయారు చేయడానికి 10 రోజులు పట్టింది అని సుధాకర్ చెప్పారు.

MOST READ: మ్యాక్సీ స్కూటర్‌ను ఆవిష్కరించిన హోండా

సుధాకర్ ఇప్పటివరకు తయారు చేసిన అనేక సారూప్య మోడళ్లను సుధా కార్స్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ కార్లలో హ్యాండ్‌బ్యాగ్ కార్, షూ కార్, హెల్మెట్ కార్, కెమెరా కార్, టాయిలెట్ కార్, కండోమ్ కార్, బర్గర్ కార్ మరియు అనేక ఇతర మోడళ్లు ఉన్నాయి. అతను అనేక సైకిళ్లతో పాటు ప్రపంచంలోని అతి చిన్న డబుల్ డెక్కర్‌ను కూడా రూపొందించాడు.

కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా.. !

విభిన్న కారణాల కోసం వేర్వేరు సందర్భాల్లో సొంత మార్గంలో సమాజానికి ఒక అవగాహన కల్పించడానికి నేను కార్లను తయారు చేసానని చెప్పారు. కరోనా మరింత వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో, ఇంటి వద్దే ఉండి సురక్షితంగా ఉండమని ప్రజలకు చెప్పడం చాలా ముఖ్యం మరియు కరోనావైరస్ కారుతో ఒక సందేశాన్ని అందించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

MOST READ: డుకాటీ ఇంజిన్‌తో రానున్న వైరస్‌ అలీన్ సూపర్ బైక్

Most Read Articles

English summary
Now, a ‘corona car’ to spread awareness in Telangana. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X