Just In
- 23 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 42 min ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- News
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. బస్సు అమ్మకాలు భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇదే
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. అంతే కాకుండా దాదాపు అన్ని ఐటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి.

ఈ కారణాల వల్ల బస్సుల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్) మొదటి 6 నెలల్లో భారతదేశంలో బస్సు అమ్మకాలు 90% కంటే ఎక్కువ తగ్గాయి. 2019 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 32,235 బస్సులు అమ్ముడయ్యాయి. 2020 లో ఇదే కాలంలో 2,569 బస్సులు అమ్ముడయ్యాయి.

భారతదేశంలో బస్సు అమ్మకాలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పాఠశాల మరియు కళాశాల బోర్డు కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్న నిర్ణయం. చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్నందున, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
MOST READ:గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్ ; ఈ వెహికల్స్ కొనే వారికీ భారీ ఆఫర్స్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల రవాణా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ కారణంగానే కార్పొరేషన్లు బస్సు తయారీదారుల నుండి కొత్త బస్సులను కొనడం లేదు. 2019 సెప్టెంబర్‌లో భారతదేశంలో 3,323 బస్సులు అమ్ముడయ్యాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 670 కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో బస్సు అమ్మకాలు తగ్గుతున్నందున బస్సుల తయారీదారులు విదేశీ మార్కెట్లకు బస్సుల ఎగుమతి కోసం ఒత్తిడి చేస్తున్నారు.
MOST READ:చెన్నై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్

కొన్ని నివేదికల ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ప్రజలు బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడకపోవడంతో బస్సు యజమానులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. కొత్త బస్సుల కొనుగోలును కూడా వారు వాయిదా వేశారు.

తమ సొంత వాహనాల్లో ప్రయాణించడం సురక్షితం అని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. ద్విచక్ర వాహనం మరియు కార్ల అమ్మకాలు కొన్ని నెలల ముందు బాగా పడిపోయాయి.
MOST READ:భారత మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ ఎప్పుడంటే?

మారుతున్న పరిస్థితి కారణంగా ప్రజలు తమ సొంత వాహనాలను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. దసరా మరియు దీపావళి సీజన్ వల్ల ద్విచక్ర వాహనాలు మరియు కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కానీ బస్సుల అమ్మకాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. పాఠశాలలు మరియు కాలేజీలు పునః ప్రారంభమైతే మళ్ళీ ఈ అమ్మకాలు కొనసాగే అవకాశం ఉంది.