లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ ప్రకటన వల్ల దేశ వ్యాప్తంగా వాహన సేవలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రక్కులు మరియు సరకులు రవాణా చేసే వాహనాలు కూడా రాష్ట్ర సరిహద్దులోని నిలిచిపోవలసి వచ్చింది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం వల్ల మొత్తం 21 రోజుల పాటు అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి. ట్రక్కు డ్రైవర్లు మరియు వస్తువుల రవాణా వాహనాలకు లాక్ డౌన్ పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈ వాహనాలన్నీ రహదారులపైనే చిక్కుకుపోయాయి.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

ఆటో నివేదిక ప్రకారం సుమారు 3.5 లక్షల వస్తువులు మోసుకెళ్ళే ఇంటర్-స్టేట్ ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువులలో కార్లు, బైక్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు మరియు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. అంతే కాకుండా ఇతర పాడైపోయే వస్తువులయిన ఆహారం, పౌల్ట్రీ వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువుల ధర దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా ఉంటాయి.

MOST READ: ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నవీన్ పట్నాయక్ నిర్ణయం, అదేంటో తెలుసా.. ?

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

ఈ లాక్ డౌన్ కారణంగా ఇంత మొత్తంలో సరుకు రవాణా నిలిచిపోవడమే కాకుండా డ్రైవర్లు కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లకు ఆహారం, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ట్రక్ డ్రైవర్లు తమ ట్రక్కుల్లోని పాడైపోయే వస్తువుల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ "కుల్తారన్ సింగ్ అట్వాల్" మాట్లాడుతూ ట్రక్కర్లు మరియు వేలాది కోట్ల విలువైన వస్తువులు రోడ్లపైనే ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆహారం, మెడిసిన్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే ట్రక్కుల ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని అట్వాల్ పేర్కొన్నారు.

MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

ఇప్పటికే చాలా ట్రక్కులు చెక్‌పోస్టుల వద్ద చిక్కుకుపోయాయి. చాలా మంది డ్రైవర్లు తమ ట్రక్కులను వదిలి ఇంటికి తిరిగి వెళ్లారని నివేదికలు సూచిస్తున్నాయి.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

ట్రక్కర్లు ఇప్పుడు బెయిలౌట్ ప్యాకేజీలు మరియు ఇతర రకాల మద్దతును ప్రభుత్వం నుండి కోరుతున్నారు. రహదారి మరియు వస్తువుల పన్ను చెల్లింపులకు ఆరు నెలల టైమ్ తో పాటు, ఆరు నెలల EMI విరామం మరియు అదే సమయంలో జాతీయ అనుమతుల పొడిగింపును కూడా వారు కోరుతున్నారు.

MOST READ: ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వ్యవధి పొడిగించబడుతుందని చెప్పడంతో, ప్రాథమిక అవసరాలు కూడా లేకుండా, రాష్ట్ర సరిహద్దుల వద్ద చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ల దుస్థితి చాలా కష్టంగా మారింది. వీరి దుస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, సహాయక చర్యలు కూడా త్వరలో ప్రకటించాలని ఆశిస్తున్నారు.

Most Read Articles

English summary
Coronavirus Lockdown: Trucks Carrying Rs 35,000 Crore Worth Of Goods Stranded On Highway. Read oin Telugu.
Story first published: Monday, April 13, 2020, 13:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X