లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశం మొత్తం లాక్‌డౌన్ లో ఉంది. ఈ నేపథ్యంలో వాహన సేవలన్నీ నిలిపివేయబడ్డాయి. బస్సులు, ట్రైన్లు మరియు విమాన సేవలు కూడా రద్దు చేయబడ్డాయి. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది.

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

భారత్ లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఎవరూ బయట తిరగకూడదనే నిషేధం కూడా ఉంది. కానీ చాలా మంది వీటిని వ్యతిరేఖిస్తూ బయట తిరుగుతున్నారు. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేఖంగా ప్రవర్తినే వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం, వాహనదారులపై కేసులు బుక్ చేయడం వంటివే కాకుండా జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా లాక్ డౌన్ ను ఉల్లంఘించడం వల్ల క్రికెటర్ రిషి ధావన్ కి జరిమానా విధించారు.

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ నిబంధనలకు వ్యతిరేఖంగా ప్రవర్తించిన యువ క్రికెటర్ రిషి ధావన్‌కు పోలీసులు జరిమానా విధించారు. హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన క్రికెటర్ ప్రస్తుతం తన సొంత ఊరిలో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్నప్పుడు పోలీసులు గుర్తించి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి జరిమానా విధించారు.

MOST READ: టాటా సఫారీ & నానో కార్ అమ్మకాలను నిలిపివేసిన టాటా మోటార్స్, ఎందుకంటే.. ?

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

లాక్ డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండేలా వివిధ మార్గాల ద్వారా అవగాహన కల్పించడానికి రాష్ట్ర పోలీసులు మరియు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వచ్చేలా చూస్తున్నారు. చాలా మంది పోలీసులు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు మరియు లాక్ డౌన్ ముగిసిన తర్వాతే వాటిని తిరిగి ఇస్తామని చెప్పారు.

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

రిషి ధావన్ తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్‌లో బ్యాంకుకు వెళ్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రజలు అవసరమైన పనుల కోసం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు బయటకు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే నిర్ణీత సమయంలో కాకుండా బ్యాంకుకు బయలుదేరాడు. కానీ బ్యాంకుకి వెళుతున్న రిషి ధావన్‌కు వెహికల్ పాస్ లేదు, అందుకే పోలీసులు జరిమానా జారీ చేశారు.

MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో వాహనాలకు మరియు వ్యక్తులకు పాస్ ఇవ్వడం ప్రారంభించాయి. అప్పుడు మాత్రమే వారు బయటికి రావడానికి అనుమతి ఉంటుంది. పోలీసులు వివరాలను ధృవీకరించిన తరువాత మరియు కారణాలు పొందిన తరువాత పాస్లు జారీ చేస్తారు. కానీ రిషి ధావన్ కి అటువంటి పాస్ లేకపోవడం వల్ల అక్కడికక్కడే జరిమానా విధించారు.

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

భారతదేశంలో కరోనా వైరస్ పై అవగాహనా కల్పించడానికి తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లో కరోనావైరస్ ఆకారపు హెల్మెట్స్ ధరించి ప్రాణాంతక వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్న పోలీసులు కూడా ఉన్నారు.

MOST READ: కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఇళ్ళ నుండి ఎవరూ బయటకు రాకుండా చూసేందుకు అధికారులు హాట్‌స్పాట్‌లను పూర్తిగా మూసివేశారు. వైరస్ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తారు. ఈ ప్రాంతాలలో మరిన్ని పటిష్టమైన భద్రతలు చేపడతారు.

లాక్‌డౌన్ లో బయటికి వచ్చిన క్రికెటర్ కి జరిమానా, ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?

కరోనా వైరస్ ప్రజలను ప్రభావితం చేయకుండా ఉండటానికి ఇంట్లో ఉండడం మరియు సామాజిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలి. అంతే కాకుండా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, ఖచ్చితంగా అత్యవసమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లడం వంటివి చేయాలి. అప్పుడే ఈ కరోనా మహమ్మారినుంచీ తప్పించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం లాక్‌డౌన్ ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.

MOST READ: కరోనా బాధితుల సహాయం కోసం మరో అడుగు ముందుకు వేసిన ఓలా

Most Read Articles

English summary
Indian cricketer in Range Rover Evoque BUSTED for violating Corona Virus lockdown. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X