వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

సాధారణంగా రోడ్డుపై వెళుతున్న వాహనాలను పోలీసులు, రవాణా శాఖాధికారులు ఆపుతుంటారు. అంతే కాకుండా వాహనదారులకు చలానాలు రాసి జరిమానా విధిస్తుంటారు. ఇవన్నీ తరచూ మనం చూస్తూనే ఉంటాము. అవన్నీ ఎందుకు చేస్తారో చాలామంది చూసేవారికి తెలియకపోవచ్చు. లైసెన్ లేదన్న కారణంగానే వాహనదారులలో చాలా మంది జరిమానా చెల్లించాల్సి వస్తోంది.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

రోడ్డుపై వాహనాలలో ప్రయాణించే వారు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది డ్రైవింగ్ లైసెన్స్. దీనితో పాటు హెల్మెట్ వంటి వాటిని కూడా తప్పని సరిగా ధరించాల్సి ఉంటుంది.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

చాలా మంది వాహనదారులు డ్రైవింగ్ లైసెన్ తీసుకోవడం చాల కష్టం అనుకుంటూ ఉంటారు. కానీ డ్రైవింగ్ లైసెన్స్‌ పొందటం మరియు రెన్యూవల్ చేయడం చాలా సింపుల్. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రెన్యూవల్ చేసుకోవాలి అనేదాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

MOST READ:పోలీసులకు స్వీట్లు పంచిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఎందుకో తెలుసా ?

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం ఎలా అంటే..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలంటే, మొదట ఎల్‌ఎల్‌ఆర్‌ (లర్నర్‌ లైసెన్స్‌)కు దరఖాస్తు చేయాలి. ఇందుకోసం 18 సంవత్సరాలు నిండిన వారు దగ్గర్లోని మీ-సేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడికి వెళ్లే ముందు, నాన్ ట్రాన్స్ పోర్టు వాహనాలకైతే ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలి. దీనికి స్కూల్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు, కానీ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

అదే ట్రాన్స్ పోర్టు (ఎల్లో బోర్డు) వాహనాలకైతే ఆధార్‌ కార్డుతోపాటు కనీసం ఎనిమిదో తరగతి పాసైన స్కూల్‌ సర్టిఫికెట్‌ తీసుకెళ్లాలి. మీ-సేవ సిబ్బంది ఈ వివరాలన్నీ రవాణాశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:డీలర్స్ వద్దకు రానున్న కొత్త బిఎస్ VI మహీంద్రా ఎక్స్‌యూవీ 500

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

మీ-సేవలో అప్లై చేసిన తర్వాత రవాణా శాఖ కార్యాలయంలో ఏ రోజున ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం కంప్యూటర్‌ టెస్ట్‌ (రహదారి నిబంధనలపై) పెడతారో డేట్, టైమ్ తెలియజేస్తూ రసీదు ఇస్తారు. ఆ రోజున ఆర్టీవో కార్యాలయానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వెళితే అక్కడున్న సిబ్బంది వాటిని పరిశీలించి, కంప్యూటర్‌ టెస్ట్‌ పెడతారు. ఈ టెస్ట్‌ పాసైన వెంటనే ఆరు నెలల వ్యవధితో కూడిన ఎల్‌ఎల్‌ఆర్‌ను ఇస్తారు.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

ఒకవేళ ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్టులో ఫెయిలైతే అక్కడే నిర్ణీత ఫీజు చెల్లించి మూడ్రోజుల్లో మళ్లీ పాల్గొనవచ్చు. ఇలా ఫెయిల్‌ కాకుండా ఉండటానికి రవాణాశాఖ తన వెబ్‌సైట్‌(ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌.ఓఆర్‌జీ)లో ఎల్‌ఎల్‌ఆర్‌ మాక్‌ టెస్టు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా ఎలాంటి ప్రశ్నలుంటాయన్న దానిపై అవగాహన పెంచుకోవచ్చు.

MOST READ:ఇలా చేస్తే కరోనా వైరస్ చావడం కాయం, ఎలానో తెలుసా !

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

ఎల్‌ఎల్‌ఆర్‌ పొందాక కనీసం 30 రోజులలో వెహికల్ డ్రైవింగ్‌ పూర్తిగా నేర్చుకోవాలి. వాహనం నడపడం సరిగా వచ్చిందన్న నమ్మకం రాగానే, మళ్లీ మీ-సేవ కేంద్రానికి వెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజ్ చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. రసీదులో పేర్కొన్న రోజున రవాణాశాఖ కార్యాలయానికి వెళితే డ్రైవింగ్‌ టెస్టు పెడతారు. నిబంధనల ప్రకారం వాహనం నడుపుతున్నారా లేదా? టెస్ట్ చేస్తారు. తరువాత లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యువల్ :

వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితి ముగుస్తున్న క్రమంలో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫామ్ 9 సమర్పించాలి. అలాగే శారీరక సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఫామ్ 1, 50 ఏళ్లు దాటిన వారు, వాణిజ్య వాహనాల లైసెన్స్ దారులు ఫామ్ 1ఏ(మెడికల్ సర్టిఫికెట్), ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు కూడా చెల్లించాలి.

MOST READ:కొత్త టర్బో ఇంజిన్‌తో రానున్న 2020 రెనాల్ట్ క్యాప్చర్ ఫేస్‌లిఫ్ట్

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

ఒకవేళ కార్డు గడువు తీరి పోయిన 5 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకుంటే మాత్రం తిరిగి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ లో పాసవ్వాల్సి ఉంటుంది. వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్ణీత సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా మెటార్ వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు గడువు పెంచుతున్నట్లు రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ ను 2020 జూన్ 30 వరకు ఎక్స్ టెండ్ చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇంట్లోనే ఉంటున్న సమయంలో ఫ్రిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఎవరికైతే లైసెన్స్ కాల పరిమితి ముగియనుందో వారు లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు జూన్ 30 వరకు గడువు ఇచ్చింది.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

ఆంధ్రప్రదేశ్ లోని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం https://aptransport.org/ (ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్) ఈ వెబ్ సైట్ ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల వారు అయితే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దళారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం లైసెన్సు పొందడాన్ని ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఏమైనా సమస్యలుంటే వాహనదారుల సౌకర్యార్థం కార్యాలయంలో సహాయక కేంద్రం (హెల్ప్‌డెస్క్‌) ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు. దీనికోసం అనవసరంగా దళారులను ఆశ్రయించడం చాలా నేరం. అంతే కాకుండా లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వం జారీ చేస్తున్నది కాబట్టి అర్హత ఉన్న వారికీ మాత్రమే ఈ లైసెన్స్ జారీ చేస్తారు. వాహనాలు నడపడం కూడా రాని చాలామంది రోడ్లపైనా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వాహనదారులు తప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. అప్పుడైనా మనదేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
How To Get A Driving License & Renewal Of Andhra Pradesh Motorists. Read in Telugu.
Story first published: Saturday, May 23, 2020, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X