ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు వెళుతోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు, ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న పెట్రోల్/డీజల్ మోడళ్లను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెడుతున్నాయి.

వాహన తయారీ కంపెనీలు భవిష్యత్తులో విడుదల చేయబోయే మోడళ్లను ఢిల్లీలో జరుగుతున్న 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరిస్తున్నాయి. ప్రతి రెండేళ్లకొకసారి ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 7 నుండి 12 వరకూ జరిగే ఈ వేదిక మీద ఇప్పటికే ఎన్నో మోడళ్లను ప్రవేశపెట్టారు.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో వచ్చిన టాప్ ఎలక్ట్రిక్ కార్ల గురించి డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం..

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

మహీంద్రా ఇకెయువి100

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో ఎక్స్‌పో వేదికగా అత్యంత సరసమైన ధరలో మినీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. పెట్రోల్/డీజల్ ఇంజన్ వెర్షన్‌లో లభించే కెయువి100 ఎస్‌యూవీని కంప్లీట్‌గా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రారంభ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.25 లక్షలుగా నిర్ణయించారు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

ఎలక్ట్రిక్ వెర్షన్ కెయువి100 మినీ ఎస్‌యూవీలో 15.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 40kW కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ ఉంది, 53బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ సింగల్ ఛార్జింగ్‌తో 120కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది. స్టాండర్డ్ మరియు ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీతో లభిస్తోంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

మహీంద్రా ఇఎక్స్‌యూవీ300

మహీంద్రా ఇదే ఆటో ఎక్స్‌పో ద్వారా తమ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. ఇకెయువి100 మోడల్‌కు కొనసాగింపుగా ఇఎక్స్‌యూవీ300 మోడల్‌ను సిద్దం చేసింది. 2020 ఆటో ఎక్స్‌పో ద్వారా ఫస్ట్ టైమ్ దీనిని ఆవిష్కరించారు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

2021 ప్రారంభంలో దీనిని లాంచ్ చేయాలని మహీంద్రా భావిస్తోంది. సాంకేతికంగా ఇందులో 40kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ రానుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిలోమీటర్ల మైలేజ్‌నిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 130బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మోడల్‌కు సరాసరి పోటీనిస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

రెనో క్విడ్ ఎలక్ట్రిక్ (రెనో కె-జడ్ఇ)

ఫ్రెంచ్ దిగ్గజం రెనో కూడా ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఢిల్లీలో జరుగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో క్విడ్ మోడల్ ఆధారంగా సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. రెనో కె-జడ్ఇ పేరుతో వచ్చిన క్విడ్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

రెనో స్మాల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారులో 26.8kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ కలదు, దీనికి అనుసంధానం చేసిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 125ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో లభించే రెనో క్విడ్ ఎలక్ట్రిక్ సింగల్ ఛార్జింగ్ మీద గరిష్టంగా 271కిలోమీటర్లు నడుస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

రెనో జోయ్ ఇవి

రెనో ఇండియా కె-జడ్ఇ ఎలక్ట్రిక్ కారుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన జోయ్ ఎలక్ట్రిక్ కారును 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. యూరోపియన్ మార్కెట్లో రెనో విక్రయిస్తున్న అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు జోయ్ ఎలక్ట్రిక్. అయితే ఇండియన్ మార్కెట్లో జోయ్ ఎలక్ట్రిక్ విడుదదల రెనో ఎలాంటి ప్రణాళిక చేయలేదు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

రెనో జోయ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారులో 52kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 385కిలోమీటర్ల మైలేజ్‌నిచ్చే రెనో జోయ్ గరిష్టం వేగం గంటకు 140కిలోమీటర్లు మరియు 9.5 సెకండ్లలోనే 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

టాటా ఆల్ట్రోజ్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్)

దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారును తొలుత 2019 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది, ఇప్పుడు 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలోకి తీసుకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారుకు సందర్శకుల నుండి మంచి స్పందన లభించింది. అతి త్వరలో మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేస్తున్నట్లు టాటా ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

టాటా ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ది చేసిన జిప్‌ట్రాన్ టెక్నాలజీతో వస్తోన్న రెండవ మోడల్ టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కాగా, మొదటి మోడల్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్. టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారులో కూడా అదే 30.2kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థ గరిష్టంగా 129బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు సింగల్ ఛార్జింగ్‌తో 300కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

ఎంజీ మార్వెల్ ఎక్స్

టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా పేరుగాంచిన ఎంజీ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2020 ఆటో ఎక్స్‌పో ద్వారా ఆవిష్కరించింది. ఎంజీ 2017లో షాంఘై మోటార్ షోలో ఆవిష్కరించిన విజన్-ఇ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ ఎంజీ మార్వెల్ ఎక్స్. సుమారుగా మూడేళ్ల సుదీర్ఘ పరిశోధన మరియు అభివృద్ది అనంతరం విడుదలయ్యేందుకు పూర్తి స్థాయిలో సిద్దమైంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

ఎంజీ మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 52.5kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ వ్యవస్థ కలదు, దీని నుండి ఎస్‌యూవీలోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ మోటార్లు గరిష్టంగా 184బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 400కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు కానీ, ఏ సమయంలోనైనా ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

కియా సోల్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్)

కియా మోటార్స్ 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా కియా సోల్ ఎలక్ట్రిక్ స్మాల్ హ్యచ్‌బ్యాక్ కారును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కియా ప్యాసింజర్ కార్లలో కియా సోల్ ఎలక్ట్రిక్ ఒకటి.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

కియా సోల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారులో 39.2kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 136బిహెచ్‍‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

వోక్స్‌వ్యాగన్ ఐ.డి.క్రాజ్

వోక్స్‌వ్యాగన్ ఐ.డిక్రాజ్ జర్మన్ దిగ్గజానికి చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఎస్‌యూవీ. 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన వోక్స్‌వ్యాగన్ ఐ.డి.క్రాజ్ ఎలక్ట్రిక్ క్రాసోవర్‌లో 4MOTION ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ కలదు, సింగల్ ఛార్జింగ్‌తో 500కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఐ.డి.క్రాజ్ ఎలక్ట్రిక్ గరిష్టంగా 301బిహెచ్‌‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

వోక్స్‌వ్యాగన్ సంస్థ ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌ కోసం ఐ.డి అనే సరికొత్త సబ్-బ్రాండను పరిచయం చేసింది. ఈ బ్రాండ్ పేరు కింద కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీ చేపట్టేందుకు వోక్స్‌వ్యాగన్ సంస్థ ఐ.డి బ్రాండ్ కోసం సుమారుగా 323బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనుంది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

గ్రేట్ వాల్ మోటార్స్ ఆర్1

చైనా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం, గ్రేట్ వాల్ మోటార్స్ 2020 ఆటో ఎక్స్ పో ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇరుకైన రోడ్లు, సిటీ అవసరాలు మరియు తక్కువ దూర ప్రయాణాలకు అనువుగా ఉండే ఆర్1 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పో 2020లో ఎలక్ట్రిక్ కార్లదే పైచేయి.. ఎన్ని కార్లు వచ్చాయో చూడండి!

గ్రేట్ వాల్ మోటార్స్ ఆర్1 ఎలక్ట్రిక్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అమ్ముడవుతోంది. మన కరెన్సీలో దీని ధర రూ. 6.7 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత సరసమైన చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా పేరుగాంచిన ఆర్1 మోడల్‌లో 47బిహెచ్‌పి పవర్ మరియు 125ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌కు 33kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 100కిలోమీటర్లు.

Most Read Articles

English summary
Electric Cars At Auto Expo 2020: Mahindra eKUV100, eXUV300, Renault K-ZE, Kia Soul EV & More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X