అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని రకాల రవాణా సేవలు రద్దు చేయబడ్డాయి. కానీ అత్యవసర సేవలను అందించే వాహనాలకు మాత్రం ఈ లాక్ డౌన్ లో మినహాయింపు ఉంది. ఈ వాహనాలు ఉచిత సేవలను అందించనున్నట్లు పిట్‌స్టాప్ ప్రకటించింది.

అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

బెంగుళూరులో ప్రధాన కార్యాలయంగా ఉన్న పిట్‌స్టాప్ కారు మరమ్మతులు మరియు సేవా సంస్థ. సంస్థ వినియోగదారులకు కారు సేవలను అందిస్తోంది.

అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంస్థ వారు ఫైర్ ట్రక్కులు, పోలీసు వాహనాలు, అంబులెన్సులు మరియు వైద్య సిబ్బందికి ఉచిత సేవలను అందిస్తామని పిట్‌స్టాప్ తెలిపింది. అత్యవసర సేవలను అవసరమైనప్పుడు 6262621234 కు కాల్ చేయాలని పిట్‌స్టాప్ పేర్కొంది.

అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ మరియు ఫరీదాబాద్ లలో వాహనాల మరమ్మతులు మరియు సేవలను అందించే ప్రముఖ సంస్థ పిట్‌స్టాప్. అవసరమైతే టోల్ ఫ్రీ సేవలను కూడా అందిస్తామని, అవసరమైన చోట వాహనాలను మరమ్మతులు చేస్తామని కంపెనీ తెలిపింది.

అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

పిట్‌స్టాప్ సిఇఓ మరియు వ్యవస్థాపకుడు మిహిర్ మోహన్ మాట్లాడుతూ కరోనాకు వ్యతిరేఖంగా పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మా సహాయం కోసం మా టెలిఫోన్ నంబర్ లేదా www.getpitstop.com ద్వారా మాకు తెలియజేయడం ద్వారా మా వాహనాలను ఎప్పుడైనా ఉచితంగా ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్‌స్టాప్

భారత్ మొత్తం 21 రోజులు లాక్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో వాహన సేవా కేంద్రాలు మరియు మెకానిక్ షాపులు మూసివేయబడ్డాయి. వాహన మరమ్మతు సమస్య ఏదైనా వచ్చినట్లైతే పిట్‌స్టాప్ సహాయపడుతుంది. అంతే కాకుండా స్థానిక ప్రభుత్వ అధికారులతో మరియు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా పిట్‌స్టాప్ తెలిపింది.

MOST READ: కరోనా బాధితుల సహాయం కోసం ఇండియన్ ఆర్మీ మాడిఫై చేసిన బస్

Most Read Articles

English summary
Essential service workers receive free repair for their vehicle -by Pitstop during lockdown. Read in Telugu.
Story first published: Monday, March 30, 2020, 18:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X