కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

టొయోటా అందిస్తున్న పాపులర్ "ఇన్నావో క్రిస్టా" ఎమ్‌పివిలో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే, కాగా, టొయోటా ఇప్పుడు తమ కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను అధికారికంగా ఆవిష్కరించింది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

ఈ కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ముందుగా ఇండోనేషియన్ మార్కెట్లలో విడుదల కానుంది, ఆ తర్వాత వచ్చే ఏడాది నాటికి ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ మోడల్‌కు భారత్‌లో విడుదల కాబోయే మోడల్‌కు చాలా పోలికలు ఉండనున్నాయి.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

ఈ నేపథ్యంలో, కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాకు సంబంధించిన వివరాలు, బ్రోచర్ ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఇదే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నారు.

MOST READ:హీరో గ్లామర్ 'బ్లేజ్' స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

భారత మార్కెట్లో 2016లో మేజర్ డిజైన్ అప్‌డేట్ అందుకున్న టొయోటా ఇన్నోవా ఆ తర్వాత మళ్లీ తిరిగి 2021లో పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫీచర్లు, పరికరాలతో అందుబాటులోకి రానుంది. టొయోటా ఆవిష్కరించిన ఇండోనేషియన్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను గమనిస్తే, ప్రస్తుత వెర్షన్ కన్నా ఇది చాలా భిన్నంగా, స్టైలిష్‌గా మరియు మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు భారత మార్కెట్లో లభిస్తున్న మోడల్‌తో పోలిస్తే కొంచెం పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇందులోని ఫ్రంట్ గ్రిల్‌లో ఉన్న హారిజాంటల్ స్లాట్‌ల సంఖ్య ఐదుకి పెంచారు మరియు వీటిని మందపాటి క్రోమ్ సరౌండింగ్‌తో బ్లాక్-అవుట్ థీమ్‌లో డిజైన్ చేశారు.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

హెడ్‌ల్యాంప్ యూనిట్లుగా రీడిజైన్ చేశారు. ఇప్పుడు ఇవి ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో అప్‌గ్రేట్ చేయబడ్డాయి. ఫ్రంట్ గ్రిల్‌లోని కొన్ని భాగాలు ఇప్పుడు క్రోమ్ ఇన్సర్ట్‌లను ఉపయోగించి హెడ్‌ల్యాంప్‌తో విలీనం చేసినట్లుగా డిజైన్ చేశారు.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

అప్‌డేట్ చేయబడిన కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ గ్రిల్ దిగువ భాగాన్ని బ్లాక్-అవుట్ థీమ్‌తో డిజైన్ చేశారు, దీనికి ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను కూడా అమర్చారు. ఇందులోని హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా రీడిజైన్ చేశారు.

MOST READ:వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు కొత్తగా 16 ఇంచ్ డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. ఇవి సిల్వర్ కలర్ ఉండి, బ్లాక్ సరౌండింగ్స్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఈ ఎమ్‌పివిలో వేరియంట్‌ను బట్టి డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

ఈ ఎమ్‌పివి వెనుక డిజైన్‌లో చేసిన మార్పులు స్వల్పంగానే ఉన్నాయి. ఇందులో కాంబినేషన్ టెయిల్ ల్యాంప్స్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో ఇంటిగ్రేటెడ్ రూఫ్-స్పాయిలర్ వంటి మార్పులు ఉన్నాయి. మొత్తమ్మీన వెనుక డిజైన్ చాలా క్లీన్‌గా మరియు అంతే ప్రీమియంగా అనిపిస్తుంది.

MOST READ:బ్లూటూత్ టెక్నాలజీతో యమహా ఎఫ్‌జెడ్ఎస్ డార్క్ నైట్ ఎడిషన్ విడుదల

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

పైన పేర్కొన్న కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇందులో పెద్దగా వేరే మార్పులు ఏవీ లేవని తెలుస్తోంది. చూడటానికి కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా మొత్తం సిల్హౌట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి దాని గొప్ప మరియు సొగసైన డిజైన్ కారణంగా ఎల్లప్పుడూ అద్భుతమైన రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది, కొత్త మోడల్ కూడా ఇదేరకంగా ఉండనుంది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

దీని ఇంటీరియర్స్‌లో క్యాబిన్ మొత్తం లేఅవుట్‌ను ఎక్కువగా మార్చకుండా, చిన్నపాటి అప్‌గ్రేడ్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో కొత్త రకం సీట్ అప్‌హోలెస్ట్రీ, డోర్ ఇన్‌సెర్ట్స్‌లను మనం గమనించవచ్చు. ఎక్స్‌టీరియర్‌తో మ్యాచ్ అయ్యేలా ఇంటీరియర్ కూడా బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్తగా బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఆఫర్ చేయనున్నారు.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

టాప్-ఎండ్ వేరియంట్ టొయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీలను సపోర్ట్ చేసే సరికొత్త 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పార్క్ అసిస్ట్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎమ్ఐడి స్క్రీన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. అయితే, ఇవి ఇండియా-స్పెక్ ఎమ్‌పివిలో ఉంటాయా లేదా అనేది చూడాలి.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

ఇంకా ఇందులో ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాలో లభిస్తున్న మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, క్రూయిజ్ కంట్రోల్, వాహన స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోనూ కొనసాగించనున్నారు.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

భారత మార్కెట్‌కు రాబోయే కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. అందులో ఒకటి 2.7-లీటర్ పెట్రోల్ మరియు రెండవది 2.4-లీటర్ డీజిల్ ఇంజన్.

పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా తమ కొత్త 2021 ఇన్నోవా క్రిస్టాకు సరికొత్త రూపాన్ని ఇచ్చింది. ప్రస్తుత మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్ పూర్తిగా సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉండి, ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.15.66 లక్షల నుండి రూ.23.63 మధ్యలో ఉన్నాయి. కాగా, కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాలో చేయబోయే ప్రీమియం అప్‌గ్రేడ్స్ కారణంగా దాని ధర కూడా ప్రస్తుత మోడళ్ల కాస్తంగా అధికంగా ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Toyota has unveiled the Innova Crysta facelift globally, which will be first sold in Indonesian market. The company is expected to launch the 2021 Innova Crysta facelift model sometime next year in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X