Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?
ఫియట్ యునో కారు చాలా కాలంగా ప్రపంచ మార్కెట్లలో ఉంది. భారతదేశంలో కూడా చాలా కాలంగా ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ లభించింది. కానీ ఇది మార్కెట్లో అంతగా విజయం సాధించలేకపోయింది. ఏదేమైనా ఇంజిన్ల విషయానికి వస్తే మాత్రం ఫియట్ భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ కారు నిలివేయబడింది. ఫియట్ యునో 1.3-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఫియట్ యొక్క జీప్ తయారీదారుగా భారతదేశంలో ఉంది. కానీ ఫియట్ యునో ఇప్పుడు ఎనిమిది చక్రాల కారుగా మార్పు చెందింది. ఇక్కడ ఉన్న వీడియోను గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న ఫియట్ యునో 8 టైర్లపై కదలటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది.

ఈ 8 చక్రాల కారుగా మార్పు రష్యాలో గ్యారేజ్ 54 చేత చేయబడింది. యునో కారు ఎనిమిది చక్రాలుగా మార్పు చెందింది అంటే ఇది చూడటానికి చాలా కొత్తగా మరియు పిచ్చిగా అనిపించవచ్చు. ఈ విధంగా మాడిఫై చేయడం కూడా కొంత కష్టంతో కూడుకున్న పని.
MOST READ:ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

8 చక్రాల కారుగా మాడిఫై చేయడంలో తయారీ బృందం హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రధాన భాగాన్ని ఎలా తగ్గించాలో వీడియో చూపిస్తుంది. ఇది కారు యొక్క రూపాన్ని మెరుగుపరుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇందులో అమర్చిన అదనపు చక్రాల వల్ల పెద్దగా ఉపయోగం లేదు.

మాడిఫై చేయబడిన ఈ యునో కారు వెనుక భాగంలో మూడు ఇరుసులను కలిగి ఉంది మరియు వాటిలో ఒకటి రెండింటికి పైన స్టాక్ చేయబడి ఉంటుంది. ఈ మూడు ఇరుసులలో ఏదీ ప్రత్యక్షంగా సంబంధంలేదు, కానీ యునో ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది మరియు అదనపు ట్రాక్షన్ కారణంగా ఇంజిన్ ఇప్పుడు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది.
MOST READ:మద్యం మత్తులో బైక్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిరిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]
ఈ యునో కారు వెనుక భాగంలో సస్పెన్షన్ వ్యవస్థ లేదు. కాబట్టి కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేస్తుంటే లేదా భారతదేశంలోని రహదారుల గుండా వెళుతుంటే చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.

సాధారణంగా భారతదేశంలో కారు మరియు బైక్ మాడిఫై చేయడం వంటి మార్పులు చట్టవిరుద్ధం. ఒకవేళ ఇలాంటి సవరణలను చూసినట్లయితే RTO మీ కారును స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది.
Image Courtesy: Garage 54/YouTube
MOST READ:మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా