ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

న్యూ ఫోర్స్ గూర్ఖా బిఎస్ 6, 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఫోర్స్ మోటార్స్ ఇప్పుడు తన తరువాతి తరం అయిన గూర్ఖా రోడర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

న్యూ ఫోర్స్ గూర్ఖా బిఎస్ 6 ఇప్పుడు అనేక ఫీచర్స్ తో అప్డేట్ చేసిన డిజైన్ లతో వస్తుంది. ఇందులో కొత్త బంపర్లు మరియు హెడ్‌ల్యాంప్ క్లస్టర్స్ ఉంటాయి. 2020 గూర్ఖా కొత్త గ్రిల్‌ తో పాటు బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది. కొత్త ఫోర్స్ గూర్ఖా ఇప్పుడు 165 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై 245/70 టైర్స్ ఉంటాయి. వీల్ ఆర్చెస్ మునుపటికంటే కూడా బాగుంటాయి.

ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

న్యూ బిఎస్-6 గూర్ఖా చాలా వరకు నవీనీకరించి ఉంటుంది. ఇది సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని మధ్యలో MID డిస్ప్లేతో కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండవ వరుసలో ఇండ్యూస్వెల్ సీట్లు మరియు కొత్తగా రూపొందించిన సర్క్యులర్ ఎయిర్ వెంట్స్ ని కలిగి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

ఫోర్స్ మోటార్స్ న్యూ గూర్ఖా లో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు భారత మార్కెట్లో బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది. నవీకరించబడిన ఇంజిన్ ఇప్పుడు 90 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది, మరియు 5- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

2020 న్యూ గూర్ఖా కి సంబంధిన అన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో మనముందుకు రాబోతాయి. దీనికి సంబంధించి ధరలు కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ఇది మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన తరువాత వెల్లడవుతాయని కంపెనీ తెలిపింది.

ఆటో ఎక్స్‌పో 2020: బిఎస్-6 గూర్ఖా ని ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

న్యూ ఫోర్స్ గూర్ఖా భారత మార్కెట్లో సరైన యుటిలిటేరియన్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా ఉంది. ఇది మహీంద్రా థార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించబడుతుంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: New Force Gurkha BS6 Unveiled - Expected Launch Date, Specs, Key Features & More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X