ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎకోస్పోర్ట్'లో కంపెనీ సైలెంట్‌గా ఓ కొత్త ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభిస్తున్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ ఇప్పుడు కొత్త అండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేసింది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లోని కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్), ఓవర్ ది ఎయిర్ (ఒటిఎ) అప్‌డేట్స్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లతో లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, వై-ఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కస్టమైజేషన్ మరియు కాన్ఫరెన్స్ కాల్ వంటి ఫీచర్లతో లభ్యం కానుంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ప్రస్తుతం ఎకోస్పోర్ట్‌లో లభిస్తున్న విండోస్ ఫ్లై ఆడియో ఆపరేటింగ్ సిస్టమ్‌ను కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్‌తో రీప్లేస్ చేయనుంది. ఇంటర్నెట్‌లో లీకైన సమాచారం ప్రకారం, కొత్త ఎకోస్పోర్ట్‌లోని అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో నావిగేషన్ ఫీచర్‌ను ఉపయోగించడం కోసం ప్రత్యేకమైన ఎస్‌డి కార్డ్ అవసరం లేదని తెలుస్తోంది.

MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఈ కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటుగా ఫోర్డ్ యొక్క సిగ్నేచర్ కనెక్టింగ్ టెక్నాలజీ అయిన "ఫోర్డ్ పాస్"ను కూడా సపోర్ట్ చేయనుంది. అయితే, ప్రస్తుతం కనెక్టింగ్ టెక్నాలజీలో అత్యంత పాపులర్ అయిన ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీలను సపోర్ట్ చేయదని సమాచారం.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ నాలుగు వేరియంట్లలో (ట్రెండ్, ట్రెండ్ ప్లస్, టైటానియం మరియు టైటానియం ప్లస్) లభిస్తుంది. ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే తమ అధికారిక డీలర్‌షిప్‌లకు సమాచారం పంపింది. దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఎకోస్పోర్ట్‌లోని కొన్ని కీలక ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ గ్లౌవ్‌బాక్స్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్, ఫుట్‌వెల్స్‌కు యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

అంతేకాకుండా, ఇందులో ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్-ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ లాంచ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వేగం పరిమితం చేసే పరికరం, రివర్స్ కెమెరా, మొదలైనవి ఉన్నాయి.

MOST READ:టాటా టియాగోలో కొత్త ఇంటీరియర్ ఫీచర్లు: ధర, ఇతర వివరాలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 122 పిఎస్ పవర్‌ను మరియు 149 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ ఇంజన్ 100 పిఎస్ పవర్‌ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారత్‌లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్ త్వరలో రానున్న నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ - వివరాలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చేర్చడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్, గత కొన్నేళ్లుగా ఈ విభాగంలో పెరిగిన భారీ పోటీ కారణంగా అమ్మకాల పరంగా వెనుక పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పెరిగుతున్న పోటీ, మారుతున్న ఆటో ట్రెండ్స్‌కి అనుగుణంగా కంపెనీ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Source: team bhp

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford Ecosport gets new infotainment system with android update details. Read in Telugu. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X