ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయించే ఎండీవర్ ఎస్‌యూవీ ఫీచర్లలో మార్పులు చేసింది. ఈ ఎస్‌యూవీలో లభించే వేరియంట్‌ను బట్టి కంపెనీ వాటిలో కొన్ని ఫీచర్లను తొలగించింది. డిసెంబర్ 2020 నెల నుండి ఉత్పత్తి చేయబడిన కొత్త మోడళ్లలో ఈ మార్పులు ఉంటాయి.

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి లీకైన సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఎండీవర్ అన్ని వేరియంట్లలో వెనుక వరుస సీట్లలోని ప్రయాణీకుల కోసం కేటాయించిన ఆక్సలరీ హీటర్‌ను తొలగించారు. బేస్-స్పెక్ 4x2 టైటానియం ఏటి వేరియంట్లలో మరికొన్ని ఫీచర్లను తొలగించారు.

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఈ వేరియంట్‌లో ఫ్రంట్ డోర్స్ వద్ద అమర్చిన స్టీల్ స్కఫ్ ప్లేట్లను తొలగించారు మరియు 10-స్పీకర్ ఆడియో సిస్టమ్ స్థానంలో 8-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. అంతేకాకుండా, స్పోర్ట్ మోడల్ మినహా ఈ ఎస్‌యూవీలోని అన్ని ఇతర వేరియంట్లలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కూడా తొలగించారు. కాగా, ఈ ఫీచర్ల మార్పుపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ప్రస్తుతం మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ బేస్-స్పెక్ టైటానియం 4x2 ఏటి వేరియంట్ ప్రారంభ ధర రూ.29.99 లక్షలుగా ఉంది. ఇందులో టాప్-స్పెక్ టైటానియం ప్లస్ 4x4 ఏటి ధర రూ.34.45 లక్షలుగా ఉంది. అలాగే, ఇందులో స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్ వేరియంట్‌ను కంపెనీరూ.35.10 లక్షలకు విక్రయిస్తోంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

కొత్తగా వస్తున్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో పైన పేర్కొన్న ఫీచర్లలో మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. యాంత్రికంగా ఇది అలాగే ఉంటుంది. ఇందులో 2.0-లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఈ ఇంజన్ బ్రాండ్ యొక్క ‘సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో కూడిన 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్లో ఇందులో ఆప్షనల్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఫోర్డ్ ఎండీవర్‌లో ప్రత్యేకంగా మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల భూభాగాలపై సమర్థవంతమైన పనితీరును అందించేలా ఉంటాయి. ఇందులో శాండ్, ఫాగ్/మడ్, రాక్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో హిల్ లాంచ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు రోల్ఓవర్ మిటిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క లెటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్' కూడా ఉంటుంది. దీని సాయంతో యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు మరియు వాహనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఈ ఎస్‌యూవీలోని ఇతర ఫీచర్లలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్-ఫోల్డబుల్ థర్డ్-రో సీట్స్, లెథర్ సీట్లు, కీలెస్ ఎంట్రీ మరియు పుష్-బటన్ స్టార్ట్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఫోర్డ్ ఎండీవర్‌లోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, సర్దుబాటు చేయగల స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ అసిస్ట్, యాక్టివ్ పార్కింగ్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

ఎండీవర్‌లో అనేక ఫీచర్లను తొలగించిన ఫోర్డ్; కారణం ఏంటంటే..

ఇక కొత్తగా వస్తున్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ వేరియంట్లలో చేసిన మార్పుల కారణంగా బేస్ వేరియంట్ ఎక్కువ ఫీచర్లను కోల్పోతుంది. ప్రత్యేకించి అన్ని వేరియంట్లలో యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్‌ను తొలగించడంతో ఎస్‌యూవీలోని క్యాబిన్ అనుభవం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఫీచర్ మార్పుల కారణంగా దీని ధరలు మారుతాయో లేదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Source: Team BHP

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India Revised Endeavour Features; Removes Sevaral Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X