Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 16 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఫోర్డ్ ఎండీవర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ కొత్త ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఫోర్డ్ డీలర్షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది.

తాజాగా, 91 వీల్స్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం, డీలర్ స్టాక్ యార్డులో ఉన్న ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ఎక్స్టీరియర్లలో కొన్ని డిజైన్ ఫీచర్లను ప్రత్యేకంగా నలుపు రంగులో కస్టమైజ్ చేశారు.

ముఖ్యంగా దీని ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్, దిగువ బంపర్లను పూర్తిగా నలుపు రంగులో ఫినిష్ చేశారు. అలాగే సైడ్ మిర్రర్స్‌పై బ్లాక్-ఇన్సర్ట్స్, రియర్ నేమ్-ప్లేట్ మరియు అల్లాయ్ వీల్స్‌కు బ్లాక్ డీటేలింగ్ ఇచ్చారు. ఎస్యూవీ వెనుక వైపు స్పోర్ట్ బ్యాడ్జింగ్‌తో పాటు సైడ్ స్టెప్‌ను కూడా నలుపు రంగులోనే డిజైన్ చేశారు.
MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

ప్రస్తుతానికి ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ ఎస్యూవీ ఇంటీరియర్ల వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ, ఇంటీరియర్ కూడా ఎక్స్టీరియర్ బ్లాక్ కలర్ థీమ్‌కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్లో మార్పులు కేవలం కాస్మెటిక్ మార్పులుగానే ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ ధరలు రూ.29.99 లక్షల నుండి రూ.33.42 లక్షల మధ్యలో ఉన్నాయి ( ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది.
MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ విషయానికి వస్తే, ఇది దాని మునుపటి బిఎస్4 మోడళ్లతో పోలిస్తే దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో చిన్నపాటి మార్పులను కలిగి ఉంది. ఇందులో బిఎస్6 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్పి పవర్‌ను మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ ఫోర్డ్ బ్రాండ్ యొక్క ‘సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో తయారు చేసిన 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని టాప్-ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా ఆఫర్ చేస్తున్నారు.
MOST READ:స్కోడా రాపిడ్ టిఎస్ఐ మోంటే కార్లో ఎడిషన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. వచ్చేసింది

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్' కూడా లభిస్తుంది. దీని సాయంతో వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా నియంత్రించడం మరియు వాహన సమాచారాన్ని తెలుసుకోవడం చేయవచ్చు.

ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

ఫోర్డ్ ఇండియాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ‘ఫ్లెయిర్' అని పిలిచే ఈ కొత్త వేరియంట్ ధర రూ.7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ బ్లాక్ కలర్ థీమ్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందించే అవకాశం ఉంది.