YouTube

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్రీస్టైల్ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కేవలం పరిమిత సమయం వరకు అందుబాటులో ఉండేలా, ఈ కొత్త వేరియంట్ ఫ్రీస్టైల్‌ను ఫోర్డ్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

కొత్త ఫోర్డ్ ఫ్రీస్టయిల్ వేరియంట్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే సైలెంట్‌గా డీలర్‌షిప్‌లను చేరుకుంటోంది. కొత్తగా రాబోయే ఫోర్డ్ ఫ్రీస్టైల్ ‘ఫ్లెయిర్' హ్యాచ్‌బ్యాక్ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. చిత్రాలలో చూసినట్లుగా, ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే అనేక మార్పులు చేర్పులను కలిగి ఉంటుంది.

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

అయితే, ఈ కొత్త వేరియంట్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉండనున్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఫ్లెయిర్ హ్యాచ్‌బ్యాక్ టాప్-స్పెక్ టైటానియం ప్లస్ వేరియంట్‌పై ఆధారపడి తయారు చేసినట్లు సమాచారం.

MOST READ: 2020 మహీంద్రా థార్ ఇంటీరియర్స్ లీక్; ఆగస్ట్ 15న విడుదల

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

సైడ్ డోర్స్‌పొ కొత్త బాడీ గ్రాఫిక్స్, కొత్త బూట్ లిడ్ డిజైన్ వంటి కాస్మోటిక్ మార్పులు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో రూఫ్ మొత్తాన్ని నలుపు రంగు‌లో ఫినిష్ చేశారు. అలాగే రూఫ్ రెయిల్స్ మరియు సైడ్ మిర్రర్లను కాంట్రాస్ట్ రెడ్ కలర్‌లో ఫినిష్ చేశారు. రెండు చివర్లలోని స్కఫ్ ప్లేట్లు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అల్లాయ్ వీల్స్ పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. మార్పులన్నీ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత స్పోర్టీ రూపాన్ని జోడిస్తాయి.

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఇంటీరియర్స్‌లో కూడా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్ మోడల్ కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులోని సీట్లు మరియు డోర్ ట్రిమ్స్‌పై కాంట్రాస్ట్ రెడ్ కలర్ స్టిచింగ్ ఉంటుంది. కొత్త ‘ఫ్లెయిర్' వేరియంట్ పేరును డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోలెస్ట్రీపై ముద్రించబడి ఉంటుంది.

MOST READ: స్పాట్ టెస్ట్ లో కెమెరాకి చిక్కిన కియా సోనెట్

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఇంజన్ పరంగా కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ ఫ్రీస్టైల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లనే కొత్త ఫ్లెయిర్ వేరియంట్‌లోను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 95 బిహెచ్‌పి పవర్‌ని మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఇకపోతే, 1.5-ృ లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.

కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌లో బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, పార్క్ అసిస్ట్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు బ్రాండ్ యొక్క ఫోర్డ్ పాస్ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ప్రస్తుతం మార్కెట్లో స్టాండర్డ్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ మోడల్ రూ.5.99 లక్షల నుండి రూ.8.49 లక్షల మధ్య అమ్మడవుతోంది. పెట్రోల్, డీజిల్ టైటానియం ప్లస్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.7.39 లక్షలు, రూ.8.49 లక్షలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న ఫ్లెయిర్ వేరియంట్ ధర స్టాండర్డ్ టైటానియం ప్లస్ వేరియంట్ ధర కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

డీలర్‌షిప్‌ల వద్ద కొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ - స్పై పిక్స్, డీటేల్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌పై డ్రైవ్‌‍స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ తమ స్పెషల్ ఎడిషన్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్‌ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో అనేక తయారీదారులు అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. తాజాగా రానున్న ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ కూడా కంపెనీ మంచి అమ్మకాలు తెచ్చిపెట్టగలదనేది మా అభిప్రాయం.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India could soon launch a new variant of the brand's Freestyle crossover hatchback. It could be available for a limited time in the market. Ahead of its launch, the Flair hatchback has been spotted arriving at dealerships. Read in Telugu.
Story first published: Saturday, August 8, 2020, 17:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X