Just In
- 41 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, భారతదేశంలో విక్రయిస్తున్న తమ వాహనాల కోసం కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలను ప్రకటించింది. ఫోర్డ్ వాహనాలపై 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు కవర్ చేయదగిన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీను కంపెనీ విడుదల చేసింది.

ఈ కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్ కంపెనీ విక్రయిస్తున్న ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్, ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మోడళ్లపై అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీతో దేశంలోని వినియోగదారులకు మెరుగైన యాజమాన్య అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫోర్డ్ ఇండియా ప్రకటించిన ఎక్స్‌టెండెడ్ పొడిగించిన వారంటీలో రోడ్-సైడ్ అసిస్టెన్స్ కూడా కలిసి ఉంటుంది, ఇది ఎక్స్‌టెండెడ్ వారంటీ చెల్లుబాటులో ఉన్నంత కాలం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు మూడు వేర్వేరు ప్యాకేజీల నుంచి తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. ఇవన్నీ 1.5 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇందులో 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాలు ప్యాకేజీలు ఉన్నాయి.
MOST READ:దీపావళి ఆఫర్స్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

కస్టమర్ కలిగి ఉన్న మోడల్ మరియు ఇంజన్‌ను బట్టి ఎక్స్‌టెండెడ్ వారంటీ విత్ రోడ్-సైడ్ అసిస్టెన్స్ ధరలు మారుతూ ఉంటాయి. ఇందులో వాహనం యొక్క వయస్సును బట్టిన మూడు ప్రధాన టైమ్ ఫ్రేమ్‌లు నిర్ణయిస్తారు. వీటిలో వాహన కొనుగోలు చేసిన మొదటి 90 రోజులు, 91 నుండి 365 రోజులు మరియు చివరిది 1 నుండి 3 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.

అలాగే, ఎక్స్‌టెండెడ్ వారంటీ సమయంలో వాహన మరమ్మతులకు సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ మరియు లేబర్ ఛార్జీలు కవర్ అవుతాయి. అయితే, ఇందులో యాక్సిడెంటల్ రిపేర్స్, జనరల్ వేర్ అండ్ టేర్ మరియు వెహికల్ పీరియాడిక్ మెటింటెన్స్ వంటివి కవర్ కావు. మోడల్ వారీగా ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ మరియు ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
MOST READ:అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్స్.. చూసారా ?

ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఆస్పైర్, ఫోర్డ్ ఫ్రీస్టైల్
ఈ మూడు మోడళ్లను కంపెనీ ఓకే రకమైన ఎక్స్‌టెండెడ్ వారంటీ ధరతో అందిస్తోంది. ఇవన్నీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్లలో 4 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల ధరలు రూ.8,933 మరియు రూ.11,533 మధ్యలో ఉంటాయి. అదేవిధంగా, 5 సంవత్సరాల మరియు 6 సంవత్సరాల ప్యాకేజీల ధరలు వరుసగా రూ.11,341 నుండి రూ.14,441 మరియు రూ.17,289 నుండి రూ.22,289 మధ్యలో ఉంటాయి.

పైన తెలిపిన మోడళ్లలో డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, 4 సంవత్సరాల ప్యాకేజీల ధరలు రూ.10,033 నుంచి రూ.12,933 మధ్యలో ఉన్నాయి. అలాగే, 5 సంవత్సరాల ప్యాకేజీ ధర రూ.14,541 నుండి రూ.18,641 మధ్యలో ఉండగా 6 సంవత్సరాల ప్యాకేజీ ధర రూ.23,589 నుండి రూ.30,589 మధ్యలో ఉంది.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

ఫోర్డ్ ఎకోస్పోర్ట్
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీలలో ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఇందులో బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది.

పెట్రోల్ వేరియంట్లలో 4 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ధర రూ.10,524 మరియు 13,624 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా, 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల ధరలు రూ.16,066 నుండి రూ .20,766 మధ్యలో ఉండగా, 6 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ధరలు రూ.30,089 నుండి రూ.39,189 మధ్యలో ఉన్నాయి.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

ఎకోస్పోర్ట్ యొక్క డీజిల్ వేరియంట్లను గమనిస్తే, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల ప్యాకేజీల ధరలు వరుసగా రూ.13,524 - రూ.17,624, రూ.20,066 - రూ.26,066 మరియు రూ.33,089 - రూ.43,089 మధ్యలో ఉన్నాయి.

ఫోర్డ్ ఎండీవర్
ఫోర్డ్ ఎండీవర్ దేశంలో విక్రయించే బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ. ప్రస్తుతం ఫోర్డ్ ఎండీవర్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. దీనిపై 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్‌ల ధరలు రూ.30,133 - రూ.39,533, రూ.46,171 - రూ.60,771, రూ.96,690 - రూ.1,25,499 మధ్యలో ఉన్నాయి.

భారత్‌లో ఫోర్డ్ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్‌ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలు, ఫోర్డ్ వినియోగదారులకు మెరుగైన యాజమాన్యాన్య సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ వారంటీలో ప్యాకేజ్‌లో రోడ్-సైడ్ అసిస్టెన్స్ చేర్చడం మంచి విషయం. రోడ్డుపై హఠాత్తుగా కారు నిలిచిపోయినప్పుడు లేదా రోడ్-సైడ్ అసిస్టెన్స్ అవసరమైనప్పుడు ఇది చక్కగా పనికొస్తుంది.