ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లపై రూ.1,500 మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ధరల పెంపు గల కారణాన్ని కంపెనీ వెల్లడించలేదు, అలాగే ఈ వాహనంలో ఎలాంటి అదనపు మార్పులు చేర్పులు చేయలేదు.

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

పెరిగిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధరలు అక్టోబర్ 1, 2020వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, పెరిగిన ఉత్పాదక వ్యయాల నుంచి కోలుకునేందుకు ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సంగతి తెలిసినదే.

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

తాజా ధరల పెంపు తర్వాత భారత మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధఱలు రూ.8.19 లక్షల నుండి రూ.11.73 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఇటీవలే ‘థండర్' అనే స్పెషల్ ఎడిషన్‌ మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లలోనూ లభ్యమవుతోంది.

MOST READ:కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

ఎకోస్పోర్ట్ ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి పవర్‌ను మరియు 149 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదు, ఇది కేవలం5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ20 మైలేజ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లోని కొన్ని కీలక ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ టైర్, రూఫ్ రైల్స్, ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

అంతేకాకుండా, ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, ఫ్లోటింగ్-టైప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-టోన్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బ్రాండ్ యొక్క సరికొత్త ‘ఫోర్డ్ పాస్' అనే స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫోర్డ్ పాస్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు కారులోని వివిధ ఫీటర్లను కంట్రోల్ చేయటానికి మరియు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కస్టమర్లు తమ ఎస్‌యూవీని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా, కస్టమర్లు డ్రైవర్ టెలిమెట్రీ డేటాను కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.

ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచిన ఫోర్డ్ ఇండియా; కొత్త ప్రైస్ లిస్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ ఇండియా తమ ఎకోస్పోర్ట్ ధరలను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు చాలా స్వల్పమే కాబట్టి, ఇది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలను ప్రభావితం చేయదని తెలుస్తోంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport prices have been increased in the Indian market. The price increase is very marginal and has been hiked by Rs 1,500 across all variants of the EcoSport compact-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X