Just In
- 11 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 12 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 12 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 14 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో 'ఎండీవర్ బేస్‌క్యాంప్' పేరును ట్రేడ్‌మార్క్ చేయించిన ఫోర్డ్, ఎందుకో తెలుసా?
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్షిప్ మోడల్ "ఫోర్డ్ ఎండీవర్"లో కంపెనీ ఓ కొత్త పేరును ట్రేడ్‌మార్క్ చేయించింది. 'బేస్‌క్యాంప్' పేరిట ఫోర్డ్ ఇండియా ఓ కొత్త పేరును ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ధరఖాస్తు చేసుకుంది. బహుశా ఇది ఫోర్డ్ ఎండీవర్‌లో కొత్త వేరియంట్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఫోర్డ్ ఇండియా నుండి రాబోయే ఎస్యూవీ వేరియంట్ వివరాలు లీకైన డాక్యుమెంట్లో వెల్లడయ్యాయి. ఈ ఎస్యూవీ వేరియంట్ లైనప్‌లో భాగంగా ప్రస్తుతం బేస్‌క్యాంప్ మోడల్‌ను కంపెనీ వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎవరెస్ట్ పేరుతో ఈ మోడల్‌ను విక్రయిస్తున్నారు, ఇందులో బేస్‌క్యాంప్ పేరిట ప్రత్యేక యాక్ససరీ ప్యాకేజ్‌ను కూడా అందిస్తున్నారు.

ఫోర్డ్ ఎండీవర్ బేస్‌క్యాంప్ యాక్ససరీల జాబితాలో, ఈ మోడల్‌ను ఆఫ్-రోడ్‌కు సిద్ధంగా ఉంచేందుకు స్టాండర్డ్ మోడల్‌తో అనేక అధనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో నడ్జ్ బార్, బోనెట్ ప్రొటెక్టర్, స్నార్కెల్, టో బార్, ఎల్ఈడి లైట్ బార్, రూఫ్-మౌంటెడ్ క్యారీ బార్స్, రూఫ్ ప్లాట్‌ఫామ్ మొదలైన అధనపు ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

బేస్‌క్యాంప్ మోడల్లో కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే ఉండనున్నాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో బిఎస్6 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్పి పవర్‌ను మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ ఫోర్డ్ బ్రాండ్ యొక్క ‘సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో తయారు చేసిన 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని టాప్-ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా ఆఫర్ చేస్తున్నారు.
MOST READ:స్కోడా సూపర్బ్ స్పోర్ట్ లైన్ సెడాన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్' కూడా లభిస్తుంది. దీని సాయంతో వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా నియంత్రించడం మరియు వాహన సమాచారాన్ని తెలుసుకోవడం చేయవచ్చు.

అంతేకాకుండా, ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా పానోరమిక్ సన్‌రూఫ్, టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:పోలీసులతో గొడవపడిన జొమాటో డెలివరీ గర్ల్, తర్వాత ఏం జరిగిందంటే ?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ ధరలు రూ.29.99 లక్షల నుండి రూ.33.42 లక్షల మధ్యలో ఉన్నాయి ( ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బేస్‌క్యాంప్ వేరియంట్ ఎండీవర్ ధరలు టాప్-ఎండ్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉండొచ్చని అంచనా.

ఫోర్డ్ ఎండీవర్ బేస్‌క్యాంప్ మోడల్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఫోర్డ్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఎండీవర్ ఎస్‌యూవీలో ఆఫర్ చేస్తున్న అన్ని రకాల స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను భారత్‌కు తీసుకురావాలని కంపెనీ చూస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీలో కస్టమైజేషన్ ఆప్షన్లను అందించడం ద్వారా భారత మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే