చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్‌ మరియు అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ కంపెనీలు రెండూ చేతులు కలిపి ఓ జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఈ ఫోక్స్‌వ్యాగన్-ఫోర్డ్ జాయింట్ వెంచర్ నుంచి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, కమర్షియల్ వ్యాన్లు తయారు కానున్నాయి. ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటును ఇరు కంపెనీలు అధికారికంగా ధృవీకరించాయి.

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఇరు కంపెనీల మధ్య కుదిరిన కొత్త భాగస్వామ్యంలో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఫోర్డ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023లో విడుదలవుతుందని అంచనా.

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఈ భాగస్వామ్యం నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్ వెలుపల ఈ జర్మన్ ఎమ్ఈడి ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించిన మొదటి తయారీదారుగా ఫోర్డ్ అవతరించింది. రాబోయే ఆరేళ్లలో యూరోపియన్ మార్కెట్ల కోసం ఆరు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తామని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రకటించింది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్‌-ఫోర్డ్ సంయుక్తంగా నిర్మించనున్న ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్‌ అందిస్తున్న ఐడి.3 మోడల్‌తో అనేక పోలికను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : ఆటోస్‌లో ప్రొటెక్టివ్ స్క్రీన్ అమలు చేసిన ఓలా

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఫోక్స్‌వ్యాగన్ ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని యూరోపియన్ మార్కెట్ల కోసం రానున్న ఆరు సంవత్సరాల్లో 6,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయాలని ఫోర్డ్ యోచిస్తోంది. ఫోర్డ్-ఫోక్స్‌వ్యాగన్‌ ఈవికి సంబంధించిన ఇంకా స్పష్టమైన వివరాలు ఏవీ బయటకు రానప్పటికీ, ఈ జేవీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ వాహనం మాత్రం ఫోక్స్‌వ్యాగన్‌ ఐడి3ని పోలి ఉంటుందని తెలుస్తోంది.

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

అలాగే, ఈ జాయింట్ వెంచర్‌లో భాగంగా ఫోర్డ్ అందిస్తున్న ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్‌ను ఆధారంగా చేసుకొని ఫోక్స్‌వ్యాగన్‌ ఓ కొత్త పికప్ వాహనాన్ని ఇంకా రెండు వాణిజ్య వ్యాన్‌లను కూడా తయారు చేయనున్నారు. ఈ కొత్త పికప్ ట్రక్కును ఫోక్స్‌వ్యాగన్‌ అమరోక్ అని పిలవొచ్చని తెలుస్తోంది, 2022లో ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

MOST READ: కోవిడ్-19 కారణంగా ప్రజా రవాణా పరిశ్రమలో 20 లక్షల ఉద్యోగాలు పోయాయ్: బిసిఓసిఐ

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఇక ఫోక్స్‌వ్యాగన్‌‌కి సంబంధిత ఇతర వార్తలను గమనిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే ఆవిష్కరించిన కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లకు తీసుకురావటాన్ని ప్రారంభించింది. త్వరలో ఈ మోడల్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది మార్చి నెలలో 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీని రూ.33.12 లక్షల (ఎక్స్-షోరూమ్‌) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే ఆ వెంటనే కోవిడ్-19 వైరస్ విజృంభించడం, లాక్‌డౌన్‌ను అమలు చేయటంతో దీని డెలివరీలు ఆలస్యమయ్యాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఇక ఫోర్డ్ మోటార్ కంపెనీకి సంబంధిత ఇతర వార్తల్లోకి వెళితే, ఫోర్డ్ ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్ల కోసం తమ సరికొత్త మస్టాంగ్ మాక్ 1 2021 మోడల్‌ను పరిచయం చేసింది. సుమారు 17 ఏళ్ల క్రితం ఫోర్డ్ ఉపయోగించిన 'మాక్ 1' అనే పేరుకు తిరిగి జీవం పోస్తూ 'ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1' అనే కొత్త మోడల్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది.

ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ 1 కారులో క్యూ బాల్ స్టైల్ గేర్ షిఫ్టర్, ఈ స్పెషల్ ఎడిషన్‌ను గుర్తు చేస్తూ ఛాస్సిస్ నెంబర్‌ను చెక్కిన బ్యాడ్జ్, షెల్బీ జిటి 350 నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసిన ఇతర అంశాలు కనిపిస్తాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: ఇప్పుడు సైకిల్ & ఎలక్ట్రిక్ వెహికల్ రూట్స్ కోసం ఆపిల్ మ్యాప్

చేతులు కలిపిన ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్; కొత్త వాహనాల అభివృద్ధికి శ్రీకారం

ఫోక్స్‌వ్యాగన్-ఫోర్డ్ జాయింట్ వెంచర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ ఇరు దిగ్గజ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడటం వలన ఆటోమొబైల్ పరిశ్రమకు ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాము. ఈ రెండు పాపులర్ బ్రాండ్‌లు కలిసి మరింత ఉత్తమమైన వాహనాలను తయారు చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Most Read Articles

English summary
German auto manufacturer Volkswagen, and American auto giant Ford, have made their Joint Venture official. As part of the new partnership, Ford will manufacture a new electric vehicle that is based on VW's Modular Electric Drive. The new vehicle is expected to launch during 2023. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X