ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మరియు భారత యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా గడచిన సంవత్సరం ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ఈ రెండు బ్రాండ్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఫోర్డ్ ఇండియా భవిష్యత్తులో భారత మార్కెట్ కోసం తీసుకురానున్న మోడళ్లన్నీ తమ అండర్‌పిన్నింగ్స్‌ను (ప్లాట్‌ఫామ్)ను మహీంద్రా మోడళ్లతో పంచుకుంటాయి.

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

సింపుల్‌గా చెప్పాలంటే టొయోటా, మారుతి సుజుకి కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం నుండి వచ్చిన బాలెనో - గ్లాంజా, విటారా బ్రెజ్జా - అర్బన్ క్రూయిజర్ మోడళ్ల మాదిరిగానే మహీంద్రా-ఫోర్డ్ కంపెనీలు కూడా ఒకే వాహనాన్ని కొద్దిపాటి మార్పుల చేర్పులు చేసి రెండు బ్యాడ్జింగ్‌లతో విక్రయించే అవకాశం ఉంది.

మహీంద్రా-ఫోర్డ్ కంపెనీల నుండి భారత మార్కెట్ కోసం అనేక మోడళ్లను ప్లాన్ చేసినప్పటికీ, అన్నింటి కన్నా ముందుగా మహీంద్రా ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనున్న మొదటి ఫోర్డ్ ఉత్పత్తి సరికొత్త సి-ఎస్‌యూవీ (మిడ్-సైజ్ ఎస్‌యూవీ) అవుతుంది. ఈ కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ మహీంద్రా నుండి రాబోయే కొత్త తరం 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయనున్నారు.

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆధారిత ఫోర్డ్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇరు కంపెనీలు ఇప్పటికే ఈ మోడల్ తయారీకి సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీకి చెందినదిగా పేర్కొంటూ దిపెట్రోల్‌బగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓ కొత్త ఫోటోను లీక్ చేసింది.

MOST READ: హ్యుందాయ్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.1 లక్ష వరకూ తగ్గింపు!

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ ఫొటోలో కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫ్రంట్ గ్రిల్ వివరాలను మాత్రమే వెల్లడి చేస్తుంది. ఈ ఫోర్డ్ ఎస్‌యూవీలో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌, దాని మధ్యలో ఫోర్డ్ లోగో ఉంటుంది. ఫోర్డ్ నుండి రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీలో స్ప్లిట్-లైటింగ్‌తో పాటు ఫ్రంట్ బంపర్‌పై సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్స్ ఉన్నట్లు కూడా ఈ చిత్రం నుండి తెలుస్తోంది.

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

ఫోర్డ్ ఇండియా తమ భవిష్యత్తు మోడళ్ల తయారీ కోసం మహీంద్రా సాయం తీసుకున్నప్పటికీ, ఈ అమెరికన్ బ్రాండ్ తమ ఉత్పత్తులలో కొన్ని సిగ్నేచర్ ఫీచర్లను, ఫోర్డ్ స్టైల్ ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ కూడా బ్రాండ్ యొక్క గ్లోబల్ ప్రొడక్ట్ లైనప్ నుండి దాని డిజైన్ స్టైలింగ్‌ను పంచుకోనుంది.

అంతేకాకుండా, ఈ కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీకి మహీంద్రా యాజమాన్యంలోని ఐకానిక్ ఇటాలియన్ డిజైన్ స్టూడియో అయిన పినిన్‌ఫరీనా నుండి కూడా అదనపు స్టైలింగ్ అంశాలు లభిస్తాయి. అలాగే, ముందు చెప్పినట్లుగానే ఈ కొత్త ఫోర్డ్ కారులోని ప్లాట్‌ఫామ్ మరియు ఇతర విడిభాగాలను మహీంద్రా నుండి రాబోయే కొత్త తరం ఎక్స్‌యూవీ500తో పంచుకుంటుంది.

MOST READ: ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

కొత్త ఫోర్డ్ సి-ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో లభ్యం కానుంది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఇవి రెండూ సుమారు 180 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయని అంచనా. అలాగే, ఈ రెండు ఇంజ్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

సరికొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ ఇండియాకు భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్పత్తి లేదు. ఈ నేపథ్యంలో, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆధారంగా వస్తున్న కొత్త ఫోర్డ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇదే భాగస్వామ్యం నుండి దేశీయ మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ సైజ్ ఎస్‌యూవీని కూడా ఫోర్డ్ ప్లాన్ చేస్తోంది, అయితే దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

ఎక్స్‌యూవీ500 ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ - స్పై చిత్రాలు

కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 మార్కెట్లో విడుదలైన కొంత కాలానికే కొత్త ఫోర్డ్ సి-ఎస్‌యూవీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు ఎంజి హెక్టర్ మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. వచ్చే మొదటి త్రైమాసికంలో కొత్త ఎక్స్‌యూవీ500, ద్వితీయ త్రైమాసికం నాటికి కొత్త ఫోర్డ్ సి-ఎస్‌యూవీలు విడుదల కావచ్చని అంచనా.

Image Courtesy: thepetrobug/Instagram

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
All New Ford SUV Spied In India, Based On 2021 Mahindra XUV500. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X