టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ తన ఎకోస్పోర్ట్ టైటానియం ఆటోమేటిక్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ ఎక్స్‌షోరూమ్ ధరగా ఈ కారు ధర రూ. 10.66 లక్షలు. ఈ కొత్త కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీ కోసం..

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

ఈ కొత్త కారును టైటానియం ప్లస్ మాన్యువల్ క్రింద కంపెనీ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ పోర్ట్ ఫోలియోలో ఉంచనున్నారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ఆటోమేటిక్ మోడల్ 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 121 బిహెచ్‌పి శక్తిని, 149 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ఆటోమేటిక్ మోడల్‌లో అనేక ఫీచర్లను అందించింది. ఇందులో పాడిల్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ అసిస్ట్ ఉన్నాయి.

MOST READ:వావ్ అమేజింగ్ : ఇది రెండు చక్రాలపై నడిచే ట్రాక్టర్..!

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

కొత్త కారును విడుదల చేసిన సందర్భంగా ఫోర్డ్ ఇండియా సేల్స్ - సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా మాట్లాడుతూ, కొత్త టైటానియం మోడల్‌ను విడుదల చేయడంతో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలనుకుంటున్నామన్నారు.

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 7 సంవత్సరాలు దేశీయ మార్కెట్లో సేవలందించింది. ఈ కారును మొదట 2012 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ కారుగా పరిచయం చేశారు. ఈ కారు ఒక సంవత్సరం తరువాత 2013 లో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది.

MOST READ:గుంటలో పడిన కారును బయటకు తీసిన ఏనుగు [వీడియో]

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, ఫోర్డ్ 2021 లో కొత్త ఎకోస్పోర్ట్ కారును విడుదల చేయనుంది. ఈ కారుకు మహీంద్రా ఎక్స్‌యూవీ 300 శక్తినివ్వనుంది. ఎక్స్‌యూవీ 300 లో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 108.5 బిహెచ్‌పి శక్తి మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టైటానియం ఆటోమేటిక్ మోడల్ లాంచ్ చేసిన ఫోర్డ్, దీని రేటెంతంటే ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫర్లలో ఒకటి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ చాలా సంవత్సరాలుగా అనేక నవీకరణలను పొందింది. అంతే కాకుండా ఇప్పుడు ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త మోడళ్లతో పోటీ పడేలా చేస్తుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యువి 300 మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:హీరో బైక్ డ్రైవ్ చేసిన గ్రేట్ ఖలీ [వీడియో]

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport Titanium AT Variant Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 16, 2020, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X