కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా అందరిని ముప్పుతిప్పలుపెడుతున్న కరోనా వైరస్ గురించి అందరికి తెలుసు. ఇటీవల కాలంలో ఈ వైరస్ బారిన పడి చాల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. రోజు రోజుకి ఈ వైరస్ బారిన పడి చనిపోతున్న ప్రజల సంఖ్య పెరిగిపోతూ ఉంది.

కరోనా వైరస్ ప్రభావం ప్రజలకు మాత్రమే కాకుండా అటుపక్క ఆటో పరిశ్రమను కూడా దెబ్బతీస్తుంది. చైనాలోని ఆటో పరిశ్రమలు ఇప్పటికే చాలా నష్టాలపాలయ్యాయి. ఉత్పత్తులు కూడా భారీసంఖ్యలో తగ్గిపోతుంది. ఈ వైరస్ మహమ్మారివల్ల ఇప్పుడు 2020 జెనీవా మోటార్ షో ఎట్టకేలకు రద్దు చేయబడింది. కరోనా వైరస్ వల్ల ఎందుకు రద్దుచేయబడినదనే దాని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.. !

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

కరోనా వైరస్ కారణంగా 2020 జెనీవా మోటార్ షో రద్దు చేయబడింది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా ముందస్తు జాగ్రత్త వల్ల స్విజ్జర్లాండ్ ప్రభుత్వం ఈ మోటార్ షోని రద్దు చేసింది. ఈ కార్యక్రంలో పాల్గొనే ఉత్పత్తి దారులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

సాధారణంగా 2020 జెనీవా మోటార్ షో మార్చి 5 నుంచి 15 వరకు జరుగుతుందని ప్రకటించింది. కానీ ఈ కరోనా వైరస్ వల్ల అక్కడ ప్రభుత్వం ఈ ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దు చేయబడింది.

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ మాట్లాడుతూ జెనీవా మోటార్ షో ఇప్పుడు రద్దు చేయబడిందని, ఎందుకంటే ఈ మోటార్ షోలో ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది కావున ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఇటువంటి ప్రదేశాలలో ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ షో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

2020 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో, పాలెక్స్పో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు ఆటో తయారీదారులకు కూడా తెలియజేయడం జరిగింది.

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

ఇంతకు ముందు జరిగిన జెనీవా మోటార్ షోలో టాటా మోటార్స్ ఇప్పుడు గ్రావిటాస్ అని పిలువబడే ఏడు సీట్ల హారియర్ ఎస్‌యువిని, హెచ్ 2 ఎక్స్ మైక్రో-ఎస్‌యువి కాన్సెప్ట్, ప్రొడక్షన్-స్పెక్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఆల్ట్రోజ్ ఇవి కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. ఏది ఏమైనా ఈ సంవత్సరం జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దు చేయడం వాళ్ళ కొత్త వాహనాలను చూసేఅవకాశాన్ని కోల్పోయాము.

కరోనా వైరస్ దెబ్బకి నిలిచిపోయిన 2020 జెనీవా మోటార్ షో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 జెనీవా మోటార్ షో రద్దు చేయడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. ఇప్పటికే చాలా వాహన తయారీ సంస్థలు కరోనా వైరాస్ వల్ల చాల వరకు నష్టపోయాయి. ఈ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ కరోనా వైరస్ వల్ల కొంత ఉపశమనం దొరుకుతుంది.

Most Read Articles

English summary
Geneva Motor Show 2020 Cancelled Due To Coronavirus Alert. Read in Telugu.
Story first published: Saturday, February 29, 2020, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X