ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

గ్రేట్ వాల్ మోటార్స్ ఇప్పుడు ఆర్ 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. గ్రేట్ వాల్ మోటార్స్ నుండి వచ్చిన ఆర్ 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఆటో ఎక్స్‌పో 2020 లో భారత్‌లోకి అడుగుపెట్టింది. జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చౌకైన కారు.

ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

ప్రస్తుతం ఇది చైనాలో లభిస్తుంది. ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లో దాదాపు రూ. 7 నుంచి 8 లక్షల ధరను కలిగి ఉంది. ఆటో ఎక్స్‌పో 2020 లో చైనా బ్రాండ్ నుంచి ప్రదర్శించిన 10 మోడల్స్ లో జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఒకటి.

ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

జిడబ్ల్యుఎం ఆర్ 1 ఎలక్ట్రిక్ కారు ఆల్-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సెలెరియో కంటే చిన్నగా ఉంటుంది. చిన్న ఆర్ 1 ఎలక్ట్రిక్ ప్రయాణికులకు చాలా ననుకూలంగా ఉంటుంది. ఇది 33kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 47 బిహెచ్‌పి మరియు 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

ఈ కారు మంచి పనితీరును కలిగి ఉంటుంది. ఈ ఈఎలెక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. ఇది ప్రామాణిక మరియు వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా వస్తుంది. బ్యాటరీలు కేవలం 40 నిమిషాల్లోపు 80% వరకు ఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటాయి.

ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

కారు చాలా చౌకగా ఉన్నప్పటికీ ఇది అనేక ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడితో ఎబిఎస్, రెండు ఎయిర్‌బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటో ఎక్స్‌పో 2020 మొదటి రోజున వాహనాలు చాలా వరకు తమ ఉనికిని చాటుకున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడం జరిగింది. గ్రేట్ వాల్ మోటార్స్ ఆర్ 1 ఎలక్ట్రిక్ ఇంకా అతి తక్కువ కాలంలోనే ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Great Wall Motors R1 Electric Unveiled - World’s Cheapest Electric Car. Read in Telugu.
Story first published: Thursday, February 6, 2020, 7:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X