భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

గ్రూప్ పిఎస్ఎ భారత మార్కెట్ కోసం యూరోరెపార్ రేంజ్ మల్టీ బ్రాండ్, హై-క్వాలిటీ ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఇవి గోమెకానిక్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానున్నాయి. ఇందుకోసం పిసిఎ ఇండియా గోమెకానిక్‌తో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గోమెకానిక్ భారత్‌లో ప్రముఖ ఆఫ్టర్ మార్కెట్ స్పేర్ పార్ట్ రిటైలర్‌గా ఉంది మరియు ఇ-కామర్స్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంది.

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

ఈ విషయంపై గ్రూప్ పిఎస్ఎ, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోలాండ్ బౌచారా మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడిన, ఆఫ్టర్ మార్కెట్ బ్రాండ్, యూరోరెపార్‌ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. గ్రూప్ పిఎస్ఎ చేత క్రమపద్ధతిలో ఆడిట్ చేయబడిన సరఫరాదారుల ద్వారా కఠినమైన, సమగ్రమైన నాణ్యమైన విధానాలతో యూరోరెపార్ ఉత్పత్తులు అభివృద్ధి చేయబడుతాయి. స్మార్ట్ ధరల వద్ద విడిభాగాల కోసం చూస్తున్న కస్టమర్లు మరియు ప్రీమియం ఆఫ్టర్ మార్కెట్ బ్రాండ్ల కోసం అధిక ధరను ఖర్చు చేయడానికి ఆసక్తి చూపని వారి కోసం యూరోరెపార్ ఉత్తమ ప్రత్యామ్నాయం అని మేము నమ్ముతున్నామని" అన్నారు.

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

భారత మార్కెట్లో యూరోరెపార్ విడిభాగాల అమ్మకాలకు గోమెకానిక్ సహకరిస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీకి బలమైన మార్కెట్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. పిసిఎ ఇండియా యూరోరెపార్ భాగాలను గోమెకానిక్‌కు అందిస్తుంది, ఆ తరువాత వాటిని వేర్‌హౌస్‌లు మరియు విడిభాగాల పంపిణీ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్క్‌షాప్‌లు మరియు రిటైలర్లకు పంపిణీ చేస్తుంది.

MOST READ:సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

యూరోరెపార్ బ్రాండ్ లాంచ్ అండ్ అసోసియేషన్ గురించి గ్రూప్ ఆఫ్ పిఎస్ఎ - ఇండిపెండెంట్ ఆఫ్టర్ మార్కెట్ బిజినెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీన్ క్రిస్టోఫ్ బెర్ట్రాండ్ మాట్లాడుతూ, "పిఎస్ఎ ఆఫ్టర్ మార్కెట్ యొక్క గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా యూరోరెపార్‌ను భారతదేశంలో ప్రారంభించాలని నిర్ణయించాము. గ్లోబల్ మార్కెట్ల కోసం గ్రూప్ పిఎస్ఎ యొక్క 'పుష్ టు పాస్' వ్యూహంలో భారతదేశం ఒక ముఖ్య భాగం మరియు ఇది గ్రూప్ పిఎస్ఎ యొక్క కస్టమర్ సెంట్రిక్ విధానాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. గోమెకానిక్‌తో భాగస్వామ్యం కావాలన్న మా నిర్ణయం మా సాధారణ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది, ఇది వినియోగదారులందరికీ అధిక నాణ్యత మరియు విలువను అందించడం. ఈ వ్యూహం భారతదేశంలో గ్రూప్ పిఎస్‌ఎను మరింత దృఢంగా స్థాపించడానికి మరియు పెద్ద కస్టమర్ బేస్‌ను జయించటానికి సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము" అని చెప్పారు.

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

యూరోరెపార్ అనేది వాహనాల మరమ్మత్తు మరియు నిర్వహణ (రిపేర్ అండ్ మెయింటినెన్స్) కోసం గ్రూప్ పిఎస్ఎ యొక్క మల్టీ-బ్రాండ్ విడిభాగాలు మరియు ఉపకరణాల (స్పేర్స్ అండ్ యాక్ససరీస్)ను అందించే బ్రాండ్. ఇది ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. నాణ్యత మరియు విలువ కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 3 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వాహనాలకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, విడి భాగాలను ఇది సరఫరా చేస్తుంది.

MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

సెప్టెంబర్ 29, 2020 నుండి దేశంలోని 15 ప్రధాన నగరాల్లోని గోమెకానిక్ వర్క్‌షాప్‌లు మరియు రిటైలర్ల ద్వారా అధిక-నాణ్యత గల బ్రేక్ ప్యాడ్‌లు, వైపర్ బ్లేడ్లు, ఫిల్టర్లు (ఎయిర్, ఆయిల్ మరియు ఫ్యూయెల్) బ్రేక్ డిస్క్‌లు, కూలెంట్, గ్రీజ్ అండ్ లూబ్రికెంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఒప్పందంలో భాగంగా మార్కెటింగ్, శిక్షణ మరియు బ్రాండ్ బిల్డింగ్ పరంగా కూడా పిఎస్‌ఎ మద్దతు ఇస్తుంది.

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

ఈ భాగస్వామ్యం గురించి గోమెకానిక్, కోఫౌండర్ అమిత్ భాసిన్ మాట్లాడుతూ "యూరోరెపార్ బ్రాండ్‌ను భారతదేశంలో ప్రారంభించటానికి గ్రూప్ పిఎస్‌ఎతో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము నాణ్యమైన సేవలను మరియు విడిభాగాలను మా కస్టమర్లకు సరసమైన ధరతో అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ భాగస్వామ్యం మాకు బాగా ఉపయోగపడుతుంది. మేము దేశంలో మా సేవా కేంద్రాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇదొక చక్కటి అవకాశంగా మారింది. భారతదేశవ్యాప్తంగా మాకు ఉన్న 350కి పైగా వర్క్‌షాప్‌లు మరియు బలమైన విడిభాగాల పంపిణీ నెట్‌వర్క్‌తో, గ్రూప్ పిఎస్‌ఎ యొక్క ఆఫ్టర్ మార్కెట్‌ను స్కేల్ చేయడంలో మేము సహాయపడగలమని మాకు నమ్మకం ఉంది" అని అన్నారు.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్ : ధర & ఇతర వివరాలు

భారత్‌లో యూరోరెపార్ మల్టీ బ్రాండ్ హై క్వాలిటీ స్పేర్ పార్ట్స్ విడుదల

భారత్‌లో యూరోరెపార్ బ్రాండ్ విడిభాగాల లభ్యతపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గోమెకానిక్ - గ్రూప్ పిఎన్ఏ కంపెనీల సహకారం ద్వారా మన దేశంలో మంచి నాణ్యమైన విడిభాగాలు సరసమైన రేట్లక్ లభ్యం కానున్నాయి. గోమెకానిక్ ద్వారా ఈ విడిభాగాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి, లభ్యత సమస్య కాదు మరియు అవి ఇంటింటికీ సేవలను అందిస్తాయి.

Most Read Articles

English summary
Groupe PSA has launched the Eurorepar range of multi-brand, high-quality aftermarket products for the Indian market. PCA India has signed a sales and distribution agreement with GoMechanic, which is an Indian aftermarket spare part retailer and an e-commerce technology platform. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X