పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

గురుగ్రామ్ నగరంలో శాంతి నెలకొల్పడానికి మరియు నేరాలను నివారించడంపై ద్రుష్టి సారించడానికి పోలీసులకు డిఎల్ఎఫ్ ఫౌండేషన్ వారు మూడు మహీంద్రా స్కార్పియో కార్లను గురుగ్రామ్ పోలీసులకు అందించింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం!

పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

గురుగ్రామ్ నగరంలో పోలీసులు మరింత రక్షణ కల్పించడానికి తమ వంతు సహాయంగా పోలీస్ సీనియర్ అధికారులు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో డిఎల్‌ఎఫ్ ఫౌండేషన్ సిఇఓ డాక్టర్ వినయ్ సాహ్ని గురుగ్రామ్ పోలీసు కమిషనర్ మహ్మద్ అకిల్‌కు ఈ మూడు స్కార్పియో వాహనాలను అందజేశారు.

పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

ఈ సందర్భంగా గురుగ్రామ్ ఐపిఎస్ పోలీసు కమిషనర్ ముహమ్మద్ అకిల్ మాట్లాడుతూ ఈ వాహనాలను గురుగ్రామ్ పోలీసులకు అందించిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్‌కు మేము సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

డిఎల్‌ఎఫ్ ఫౌండేషన్ వారు ఇచ్చిన కార్లు లైట్ మెషిన్ గన్ తో అమర్చబడి సవరించబడ్డాయి. ఈ కార్లను శిక్షణపొందిన కమాండోలు నిర్వహిస్తారు. గురుగ్రామ్ అధిక శ్రామిక జనాభా కలిగిన కార్పొరేట్ కేంద్రంగా ఉండటంతో ప్రజలను కాపాడటం మా ప్రాథమిక బాధ్యత అన్నారు. ఇవి భద్రత స్థాయిని పెంచుకోవడానికి ఉపయోగిస్తామని తెలిపారు.

పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

ఈ స్కార్పియో క్యూఆర్టి వాహనాలను మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ప్రత్యేకంగా సవరించాయి. హైడ్రాలిక్ కపోలాతో పైకప్పుపై ఎల్‌ఎమ్‌జిని అమర్చాలనే నిబంధనతో వెపన్ హోల్డర్ వాహనం కదులుతున్నప్పుడు ఫైర్‌పవర్‌తో 360 డిగ్రీలు నిమగ్నం చేయగలదు. అన్ని ప్రతికూల పరిస్థితులలో పని సౌలభ్యం కోసం వాహనం ఇంటర్‌సెప్టర్ మరియు ఫాగ్ లైట్ ను కూడా అమర్చబడి ఉంటుంది.

పోలీసులకే కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన డిఎల్ఎఫ్ ఫౌండేషన్.. ఎందుకో మరి మీరే చూడండి

ఈ వాహనాలు నగరంలో పెట్రోలింగ్ చేయడానికి మరియు నిఘా కోసం ఉపయోగించబడతాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న మహిళలకు సహాయపడటానికి మరియు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి.

గురుగ్రామ్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి డిఎల్ఎఫ్ ఫౌండేషన్ వారి నిబద్దత అభినందనీయం. దేశంలో రోజు రోజుకి మహిళలకు పెరుగుతున్న అభద్రతను కాపాడటానికి, సంఘంలో శాంతిని నెలకొల్పడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. సమాజంలో శాంతియుతమైన వాతవరణం నెలకొల్పాలని ఆశించారు.

Most Read Articles

English summary
DLF Foundation gifts Gurugram Police with 3 customised Scorpios. Read in Telugu.
Story first published: Saturday, February 15, 2020, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X